భారత్- పాక్ ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు ఇప్పటిలో ఉండవంటూ క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ అన్నాడు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, సరిహద్దుల్లో కూడా పాక్ ఉగ్రవాద దాడులకు పాల్పడుతుంది. ఇటువంటి తరుణంలో పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ జరిగే ప్రసక్తే ఉండదు. పాకిస్తాన్ తో సిరీస్ కు సంబంధించి బీసీసీఐ ఎటువంటి ముందడుగు వేయాలనుకున్నా గవర్నమెంట్ తో మాట్లాడటం మంచిది. పాకిస్తాన్ తో ద్వైపాక్షిక సిరీస్ అనేది ఇప్పట్లో చాలా కష్టం అని విజయ్ గోయల్ పేర్కొన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేవరకూ వారితో ఎటువంటి క్రీడాసంబంధాలు ఉండవని ఆయన మరోసారి తెగేసి చెప్పారు. దాంతో చాంపియన్స్ ట్రోఫీలో పాక్ తో .చర్చలు జరపాలనుకున్న బీసీసీఐకి ఆదిలోనే చుక్కెదురైనట్లయ్యింది.