//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హీరోయిన్ నివేథా పై అత్యాచారం..?

Category : movies

ప్రపంచం మొత్తం ఇప్పుడు వైర‌ల్ అవుతున్న హాట్ టాపిక్ క్యస్టింగ్ కౌచ్. ఎక్కడ చూసినా ఆడవారి పై దారుణాలు..అత్యాచారాలు జరుగుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా దేశ వ్యాప్తంగా జమ్మూ కాశ్మీర్, యూపీలో జరిగిన అత్యాచార ఘటనలు దేశంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. కొంత కాలంగా టాలీవుడ్‌కి చెందిన మహిళా ఆర్టిస్టులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి బయట పెడుతున్నారు. బాలీవుడ్‌కి చెందిన పలువురు నటీమణులు కూడా ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నామని వెల్లడించారు.

ఇలాంటి తరుణంలో తమినాడు కు చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ అయిన నివేథా పేతురాజ్ తన బాల్యంలో ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి మాట్లాడారు. తెలుగులో శ్రీవిష్ణు స‌ర‌స‌న‌ మెంటల్‌ మదిలో చిత్రంలో న‌టించిన నివేదా పేతురాల్ చిన్న‌ప్పుడు తనపై లైంగిక వేధింపులు జరిగాయని వెల్లడిస్తూ సోషల్‌మీడియాలో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారే అయివుంటారని భావిస్తూ ఈ వీడియోను పోస్ట్‌ చేస్తున్నాను. వారిలో నేనూ ఉన్నాను.. ఐదేళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురయ్యాను. ఈ విషయాన్ని నా తల్లిదండ్రులకు ఎలా చెప్పను.. తెలియని వారికంటే.. మన బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వారిలోనే ఇలాంటి పనులకు పాల్పడే వారు చాలా మందే ఉంటారని నివేదా చెప్పుకొచ్చింది.