Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒక్క మాట‌తో.. మోడీ ప‌రువును బ‌జారుకీడ్చాడు..!

Category : politics

పేద ప్ర‌జ‌ల సంక్షేమ‌మే నా ధ్యేయం.. సామాన్యుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతున్న ప్ర‌తీ ప‌థ‌కం చేరుస్తా.. విదేశాల్లో ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని సైతం భార‌త్‌కు తెప్పించి.. దేశంలోని ప్ర‌తీ ఒక్క‌రి బ్యాంకు ఖాతాలో రూ.5 ల‌క్ష‌లు జ‌మ చేస్తా అంటూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మ‌బ‌లికి 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌రువాత‌ న‌రేంద్ర మోడీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

ఇక‌, అప్ప‌టి నుంచి త‌మ బ్యాంకు ఖాతాలో డ‌బ్బు జ‌మ అయిందా..? లేదా..? అని చూసుకోవ‌డం దేశంలోని ప్ర‌తీ సామాన్యుడి వంతైంది. తీరా, బ్యాంకుల చుట్టూ తిర‌గేందుకు అయ్యే ప్ర‌యాణ ఖ‌ర్చుల‌ను భ‌రించ‌లేక, న‌రేంద్ర మోడీ ఓట్ల కోసం త‌మ‌ను న‌ట్టేట ముంచాడ‌ని తెలుసుకున్న ప్ర‌తీ సామాన్యుడు నిట్టూర్చాడు.

అప్ప‌టికే పుట్టెడు దు:ఖ‌ంలో ఉన్న సామాన్యుడిపై మూలిగే న‌క్క‌పై తాటికాయ‌ ప‌డ్డ‌ట్టు జీఎస్టీని దేశ వ్యాప్తంగా అమ‌ల్లోకి తెచ్చాడు మోడీ. దీంతో, ఒక్క‌సారిగా నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగిపోయాయి. రోజూవారి స‌రుకుల కోసం దుకాణానికి వెళ్లిన సామాన్యుడికి యాజ‌మాన్యం ఆకాశాన్నంటే ధ‌ర‌ల‌తో చుక్క‌లు చూపించారు. అదేమిట‌ని ప్ర‌శ్నిస్తే..? మోడీ మ‌హిమ జీఎస్టీ అండీ అంటూ జ‌వాబు ఇచ్చారు. దీంతో చేసేది లేక, అవ‌స‌రాల నిమిత్తం స‌రుకుల‌ను కొనుగోలు చేసి అర్థాక‌లితో అల‌మ‌టించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది సామాన్యుడికి.

న‌రేంద్ర మోడీ అంత‌టితో ఆగాడా..? అంటే అదీ లేదు. పెద్ద నోట్ల ర‌ద్దు అంటూ మ‌ళ్లీ మ‌రో బాంబ్‌ను పేల్చాడు. అప్ప‌టికే నిత్యావ‌స‌ర వ‌స్తువ‌ల ధ‌ర పెరుగుద‌ల‌తో తీవ్ర బాధ‌లో ఉన్న సామాన్యుడుని పెద్ద నోట్లను ర‌ద్దు చేసి మ‌రింత పాతాళానికి తొక్కేశాడు. మోడీ తీసుకున్న ఆ నిర్ణ‌యంతో ప్ర‌తీ సామాన్యుడు బ్యాంకుల చుట్టూరా తిర‌గాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.,

పోనీ, మోడీ తీసుకున్న పెట్రోలు ధ‌ర‌ల పెరుగుద‌ల‌, పెద్ద‌నోట్ల ర‌ద్దు, జీఎస్‌టీ నిర్ణ‌యాల‌తో దేశం అభివృద్ధిలో ప్ర‌గ‌తి సాధించిందా..? అంటే అదీనూ లేదు. జీడీపీ వృద్ధి రేటు కాస్తా ఒక్క‌సారిగా ప‌డిపోయింది. మ‌రో ప‌క్క రూపాయి విలువ గురించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. డాల‌ర్ విలువ ఆకాశాన్నంటుతుంటే.. రూపాయి విలువ మాత్రం రోజురోజుకు ప‌డిపోతూ సామాన్యుడికి చుక్క‌లు చూపిస్తుంది. ఇలాంటి ప‌రిణామాల‌తో దేశ వ్యాప్త ప్ర‌జ‌లు మోడీకి వ్య‌తిరేకంగా ఆగ్ర‌హావేశాల‌ను క‌న‌బ‌రుస్తున్నారు. దీంతో 2019లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల‌తో మోడీ ప్ర‌భుత్వం కూలిపోవ‌డం ఖాయ‌మ‌నే సంకేతాల‌ను ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఇలా, ఓట‌మి అంచున ఓల‌లాడుతున్న మోడీ ప్ర‌భుత్వంపై తాజాగా, కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపాయి. ఇంత‌కీ నితిన్ గ‌డ్క‌రీ ఏం చెప్పారంటే..? ఇటీవ‌ల క‌ల‌ర్స్ అనే హిందీ ఛానెల్ నిర్వ‌హించిన అస‌ల్ ప‌వానీ.. ఈర్ష‌ల్ న‌మూనే అనే రియాల్టీ షోలో నితిన్ గ‌డ్క‌రీ పాల్గొన్నారు. ఈ షోలో పాల్గొన్న ప్ర‌తీ ఒక్క కంటెస్టెంట్ నిజాల‌నే చెప్పాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే నితిన్ గ‌డ్క‌రీ మాట్లాడుతూ.. 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ అధికారంలోకి వ‌చ్చేందుకు ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేలా చాలా హామీల‌ను ఇచ్చింద‌ని, ఇచ్చిన హామీల‌న్ని కూడా అమ‌లుకు నోచుకోవ‌డం క‌ష్ట‌మ‌ని తెలిసి కూడా తాము విజ‌యం సాధించేందుకు ప్ర‌జ‌ల‌ను మోస‌గించామ‌ని చెప్పారు. మేము ఇచ్చిన హామీల‌ను న‌మ్మిన ప్ర‌జలు త‌మ‌కు అధికారం ఇచ్చార‌ని, తీరా అధికారం చేప‌ట్టాక హామీల‌ను అమ‌లు చేయ‌లేక నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నామంటూ నితిన్ గ‌డ్క‌రీ వ్యాఖ్యానించారు. ఇలా కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న నితిన్ గ‌డ్క‌రీ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో దేశ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి.

Related News