//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ పనికి కూడా సిద్దమే ....!

Category : movies

మళయాళ పరిశ్రమ నుండి వచ్చి టాలీవుడ్ లో చాలా వరకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలని చేస్తున్న హీరోయిన్స్ లో నిత్యా మీనన్ ఒకరు. అలా మొదలైంది తో మొదలైన ఆమె సినీ ప్రయాణం , నిన్న వచ్చిన గీతా గోవిందం వరకు అమ్మడికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో ఈమధ్య బొత్తిగా సినిమాలు తగ్గించేసిన నిత్యా గురించి ఓ కామెంట్ వినపడుతుంది. సహజంగానే పొట్టిగా ఉండే నిత్యా మీనన్ ఈమధ్య లావు పెరగడం వల్ల తన అవకాశాలు మిస్ చేసుకుంటుందట.

నిత్యా వర్షన్ మాత్రం వేరేలా ఉంది. పొట్టిగా ఉండటం.. లావ్ పెరగడం ఇలాంటి కామెంట్స్ తాను అసలు పట్టించుకోనని. తన మీద తనకు చాలా కాన్ ఫిడెన్స్ ఉందని చెబుతుంది నిత్యా. తన జీవితంలో సినిమాలు కొంత పార్ట్ నిజంగానే సినిమా కోసం సన్నబడాలి అనిపిస్తే కచ్చితంగా సన్నబడి చూపిస్తా అంటుంది నిత్యా. సినిమా కోసమైతే చేస్తా కాని తన వరకు తాను ఎలా ఉన్నా బాగుంటానని చెబుతుంది నిత్యా .

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో అడపాదడపా అవకాశాలను అందుకుంటున్న నిత్యా మీనన్ సోలో హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే మాత్రం కాస్త లావు తగ్గాల్సిందే అని అంటున్నారు. కానీ నిత్యా తన కళ్ళతోనే హావభావాలని పలికించగల సమర్థురాలు . కళ్ళతోనే తాను ఏంచెప్పాలి అనుకున్నది చెప్పేస్తుంది . సినిమా కి అవసరమైతే తన ఏవిధంగానైనా నటించడానికి వెనుకాడదు నిత్యామీనన్ .