//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మొదట మహానటి గా అనుకున్న నటి ఎవరో తెలుసా..

Category : movies

అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ''మహానటి''. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ తో కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో సావిత్రి గారు పాత్రలో నటించిన కీర్తి సురేష్ కీర్తి అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు అదే పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా నటిస్తుంది.

ఈ చిత్రంలో కీర్తి సురేష్ తో పాటు స‌మంత‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాజేంద్ర ప్ర‌సాద్, షాలిని పాండే, అవ‌స‌రాల శ్రీనివాస్‌, జాగర్ల మూడి రాధాకృష్ణ, ప్రకాశ్ రాజ్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని వైజ‌యంతి మూవీస్ బేన‌ర్‌ పై ప్రియాంక ద‌త్‌, స్వ‌ప్నా ద‌త్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్యం వహించారు.

ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రంలో సావిత్రి గారి పాత్రలో కీర్తి సురేష్ కన్నా ముందు నిత్యామీనన్ ని అడిగారట దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ల వలన డేట్స్ అడ్జెట్ చేయలేక నో చెప్పిందంట నిత్యా. ఆతరువాత కీర్తి సురేష్ పేరు తెరపైకి వచ్చింది. ఈ పాత్రకి ఆమె కరక్ట్ గా సరిపోయడంతో షూటింగ్ స్టార్ట్ చేసాడు అశ్విన్. ఎన్నో సంచలనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ తో విమర్శకుల సైతం మెప్పించింది.