//single page style gallary page

Nithya Menen Latest Tweet To Fans

Category : movies

Click here to read this article in Telugu

బుద్ధిలేని వారు చేస్తున్న ఆరోపణలపై ఇది నా స్పందన...నిత్యా మేనన్‌!

నిత్యా మేనన్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగానే కాకుండా, నటిగానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె దక్షిణాది భాషా చిత్రాల్లో రాణించి, ఇప్పుడు ప్రస్తుతం బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌తో కలిసి నటిస్తున్న చిత్రం "మిషన్‌ మంగళ్‌". ఈ చిత్రం లో విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, తాప్సీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జగన్‌ శక్తి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిత్యామేనన్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. రెడ్‌ టాప్‌, బ్లూ జీన్‌ ధరించి చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోలు విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నాయి.

అయితే, మరోపక్క సొంత రాష్ట్రం కేరళలో వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఇలాంటి ఫొటోలు పోస్ట్‌ చేయడంపై ఆ రాష్ట్ర వాసుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇక దీంతో నిత్యామేనన్‌ వివరణ ఇచ్చుకున్నారు. తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఈమేరకు ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. "బుద్ధిలేని వారు చేస్తున్న ఆరోపణలపై ఇది నా స్పందన. గత కొన్ని రోజులుగా కేరళ వరదల గురించి నేను ఏమీ మాట్లాడటం లేదని, సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడం కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు.

అలాంటి వ్యాఖ్యలకు సాధారణంగా నేను స్పందించను. అలా ఎందుకు మాట్లాడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. అయితే నేను ఒక వీడియో చేసి పోస్ట్‌ చేద్దామనుకున్నా. అయితే, కేవలం కొన్ని విషయాలను మాత్రమే సోషల్‌మీడియాలో పంచుకుంటా. ఎవరో ఏదో అన్నారని నేను ఒక వీడియో పోస్ట్‌ చేస్తే, మీరు సంతోష పడతారు. ఆ తర్వాత మర్చిపోతారు. కానీ, అది కాదు చేయాల్సింది. ఇక ప్రస్తుతం పరిస్థితి ఏంటో నాకు తెలుసు. మేమంతా అందుకోసం కలిసి సాయం చేయాలని అనుకుంటున్నాం. ఆ విషయం మీకు తెలియదు. కానీ, నేను సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఆనందంగా ఉన్నానని అనుకుంటున్నారు. ఒక సినిమా ఒప్పుకొన్న తర్వాత ఆ చిత్ర ప్రమోషన్స్‌లో కూడా పాల్గొనడం నా విధి''.

''డబ్బుల కోసమే ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఎంజాయ్‌ చేస్తున్నానని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎవరైనా సినిమా విడుదలకు ముందు తప్పకుండా ప్రమోషన్స్‌లో పాల్గొనాలి. అందుకోసం ప్రత్యేకంగా ఏమీ చెల్లించరు. నన్ను విమర్శిస్తున్న వారందరినీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. కేరళ వరదల కోసం మీరు ఏం చేశారో మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్నకు నిజాయతీగా సమాధానం చెబితే, మరొకరిపై మీరు వేలు ఎత్తి చూపించరు. ఎదుటి వారిపై వేలెత్తి చూపే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఇతరుల పట్ల గౌరవభావంతో ఉండండి'' అని తనపై విమర్శలు చేస్తున్న వారిపై ఘాటుగా స్పందించారు నిత్యా.

Nithya Menon is not only a heroine but also an actress in the Telugu film industry. She has excelled in Southern language films and is currently co-starring Bollywood hero Akshay Kumar in " Mission Mangal ". The film stars Vidya Balan, Sonakshi Sinha and Taapsee. Pics are being directed by Shakti. The film , which has now completed all its programs, is set to premiere on August 15 . Photos of Nithya Menen 's promotions have now gone viral on social media. Photos of Red Top and Blue Jean smiling are trending.

However, if people in Kerala are suffering from floods in their home state of Kerala , there has been criticism from people of the state for posting such photos. Nitya Menon gave an explanation. He shared a video with his fans on his Facebook account . "This is my response to the allegations made by the foolish . I have not been talking about Kerala floods for the past few days. Some people have accused me of posting it on social media .

I do n't usually respond to such comments . I can understand why they say so. However I wish I could post a video . However, we share only a few things on social media . If I post a video of someone saying something, you'll be happy. And then forget about that. But, it has to be done. Now I know what the situation is . We all want to help together. You don't know that stuff. But I think I am happy to be involved in film promotions . After accepting a film, it is my duty to participate in the promotions of the film.

'' Money for the sake of participating in promotions and enjoy doing it with some comments. Someone must be involved in promotions before the movie is released. You don't pay anything special. I question all those who criticize me. Ask yourself what you did for the Kerala floods. If you answer this question truthfully, you will not point the finger at someone else. In front of them, the other point that once you ask . Be respectful of others, ”Nitya responded sharply to those who criticized her.