//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిస్సాన్‌ సన్నీపై రూ.1.99 లక్షల తగ్గింపు

Category : national business

ప్రీమియం సెడాన్‌ సన్నీ ధర రూ.1.99 లక్షల వరకు తగ్గిస్తున్నట్టు నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ప్రకటించింది.

దీంతో పెట్రోల్‌ వెర్షన్‌ సన్నీ రూ.6.99 లక్షల (ఢిల్లీ ఎక్స్‌ షోరూమ్‌ ధర) ప్రారంభ ధరలోనే లభిస్తుంది. గతంతో పోలిస్తే ఇది రూ.1.01 లక్షలు తక్కువ.

టాప్‌ ఎండ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్‌ ధర కూడా రూ.10.98 లక్షల నుంచి రూ.8.99 లక్షలకు తగ్గింది. డీజిల్‌ వెర్షన్‌ బేస్‌ మోడల్‌ ధర రూ.8.8 లక్షల నుంచి రూ.7.49 లక్షలకు తగ్గించింది. రూ.9.93 లక్షలున్న డీజిల్‌ వెర్షన్‌ టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధరనూ రూ.8.99 లక్షలకు తగ్గించింది. కార్ల తయారీకి అవసరమైన విడి భాగాలను దేశీయంగా సేకరించడం పెంచడం ద్వారా ఉత్పత్తి ఖర్చులు తగ్గడంతో, ఆ లాభాలను కార్ల కొనుగోలుదారులకు బదిలీ చేస్తున్నట్టు నిస్సాన్‌ ఇండియా ఎండి అరుణ్‌ మల్‌హోత్రా తెలిపారు.