//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Category : national

దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం చోటు చేసుకుంది.

ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బవానా బవానా పారిశ్రామిక ప్రాంతంలోని ఓ బాణ సంచా కర్మాగారంలో శనివారం సాయంత్రం మంటలు ఎగిసిపడి 17 మంది మృత్యువాతపడ్డారు. అనేక మంది గాయపడ్డారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మొత్తం 15 నుంచి 20 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పడానికి పని చేస్తున్నాయి. మృతి చెందిన వారిలో 10 మంది మహిళలు ఉన్నారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు.

ఊపిరాడక లేదా మంటల్లో సజీవంగా దహనమై వారు చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన భవనం నుంచి 17 మృతదేహాలను వెలికితీశామని అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.