//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ప్రముఖ క్రికెటర్ నన్ను వాడుకున్నాడు.

Category : movies

టీంఇండియా ఆ మాజీ క్రికెటర్ నన్ను వాడుకొని వదిలేసాడు అంటూ ఓ ప్రముఖ నటి వ్యాఖానించింది. ఆమె పంజాబీ ముద్దుగుమ్మ నికిషా పటేల్. ఈమె తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన 'కొమరం పులి' చిత్రంలో నటిచింది. ఇక ఆ సినిమా ఫ్లాప్ కావడంతో నికిషాకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత తమిళనాట తన అధృష్టాన్నిపరీక్షించుకుంది. అక్కడ చాలా సినిమాల్లోనే నటించింది. కానీ అక్కడకూడా స్టార్ ఇమేజ్ ని మాత్రం దక్కించుకోలేకపోయింది.

నికిషా పటేల్ ఏదోఒక రూమర్స్ తో వార్తలలో ఉంటుంది. అప్పట్లో క్రికెటర్ శ్రీశాంత్ తో సంబంధం ఉండనే వార్తలు బలంగా వినిపించేవి. ఈ విషయంపై శ్రీశాంత్ కానీ నికిషా కానీ ఎప్పుడూ పెదవి విప్పలేదు. కానీ శ్రీశాంత్, భువనేశ్వరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది జరిగి చాలా కాలం అవుతోంది. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్ తాను భువనేశ్వరిని ఏడేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అన్నారు.

శ్రీశాంత్ మాటలపై నికిషా పటేల్ ఆగ్రహానికి గురైంది. వేరే అమ్మాయిని ఏడేళ్లుగా ప్రేమిస్తే మరి నా సంగతేంటని ప్రశ్నించింది. తాను ఏడాది పాటు శ్రీశాంత్ తో సహజీవనం చేసినట్లు నికిషా బయటపెట్టింది. శ్రీశాంత్ తో బ్రేకప్ అయిన తరువాత ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్నాని ఇప్పుడు శ్రీశాంత్ నిజాన్ని దాచడం తట్టుకోలేకపోతున్నానని నికిషా చెప్పుకొచ్చింది.