//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

20 శాతం ఉద్యోగాలకు నైక్ కోత

Category : business

ప్రముఖ క్రీడా సామగ్రి ఉత్పత్తి సంస్థ నైక్ భారతీయశాఖలోని ఉద్యోగాల్లో భారీగా కోతపెడుతోంది. ఇక్కడ 20 శాతం ఉద్యోగులను తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఇక్కడ పని చేసే వారిలో అనేకమందిని ఆగ్నేయాసియా దేశాల్లో నిర్వహించే కార్యకలాపాల్లో చేరాలని సూచించింది. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 12 కీలక నగరాల్లోని నైక్ వ్యాపారంలో 80శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా తన వ్యాపార, ఉత్పత్తిని పునర్‌వ్యవస్థీకరిస్తోంది.

నైక్ ఎంచుకున్న నగరాల్లో న్యూయార్క్‌, షాంగై, లండన్‌, టోకియో, పారిస్‌, మెక్సికో సిటీ వంటివి ఉన్నాయి. వీటిల్లో ఒక్క భారతీయ నగరమైనా లేకపోవడం గమనార్హం. నైక్ 2005లో భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది.

అయితే భారతీయ మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న స్థానిక కంపెనీలను పడగొట్టడం ఎంత కష్టమో నైక్ కి తెలిసొచ్చింది. దేశంలో మొత్తం 200 స్టోర్లను ఈ సంస్థ సొంతంగా నిర్వహిస్తోంది. ఉద్యోగాల కోతపై నైక్ ప్రతినిధి మాట్లాడుతూ ‘కంపెనీ వ్యూహంలో భాగంగానే జూన్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఫలితంగా భారత్‌లో బెంగళూరు, దిల్లీ, ముంబయిలలో మాత్రమే ప్రధాన కార్యాలయాలు ఉంటాయి’ అని చెప్పారు.

2016 లో దేశవ్యాప్తంగా నైక్ అమ్మకాలు రూ.764కోట్లుగా నమోదుకావడంతో నష్టాలు రూ.170 కోట్లకు పెరిగాయి. అదే 2015లో రూ.803 కోట్ల మేరకు విక్రయాలు సాధించగా రూ.101 కోట్లు నష్టాలు నమోదు చేసింది. దీంతో ఉద్యోగాల్లో కోత పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.