//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నా ప్రేమ‌కు మెగా ఫ్యామీలీనే అడ్డు.. నిహారిక మ‌న‌సులో మాట‌..!

Category : movies

మెగా కాంపౌండ్ నుండి రంగుల ప్ర‌పంచంలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు డాట‌ర్.. నిహారిక ఒక్క‌మ‌న‌సు చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. ఇక ఆ సినిమా ప్లాప్ అవ‌డంతో.. ఆచి తూచి సినిమాు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం రెండు సినిమాలను చేస్తోంది. మెగా ఫ్యామిలీ పరువు తీయకుండా తాను సినిమాలు చేస్తాను అంటూ చెప్పుకొచ్చిన ఈ అమ్మడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. త‌న‌ ఫ్యామిలీ కారణంగా నిహారిక‌ను ఎవరు ప్రేమించడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఒక మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన నిహారిక మాట్లాడుతూ.. నా కాలేజ్‌ డేస్‌ నుండి కూడా చూస్తున్నాను, ఎవరైనా నాకు లవ్‌ లెటర్‌ ఇస్తారేమో, అది నా మొదటి లవ్‌ ప్రపోజల్‌గా దాచుకుందామని అనుకుంటున్నాన‌ని.. అయితే ఇప్పటి వరకు నాకు ఏ ఒక్కరు కూడా లవ్‌ ప్రపోజల్‌ చేయలేదు. ప్రేమపై పెద్దగా ఆసక్తి లేకున్నా కూడా ఎవరైనా ప్రపోజ్‌ చేస్తే బాగుండని చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానంటూ నిహారిక చెప్పుకొచ్చింది.

తన వెనుక ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌ వల్ల తనను లవ్‌ చేసేందుకు కుర్రాళ్లు బయపడుతున్నారు అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. ఎవరు కూడా తనకు ప్రపోజ్‌ చేయక పోవడంతో అసలు తాను అందంగా ఉంటానా అనే అనుమానం నాకే కలుగుతుంది. మినిమం అందంగా కూడా తాను ఉండనా అంటూ నాపై నాకే అనుమానం వేస్తుందని ఈ సందర్బంగా నిహారిక చెప్పుకొచ్చింది. కమర్షియల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోవాలనేది తన ఆశ అంటూ నిహారిక చెప్పుకొచ్చింది. రియల్‌ లైఫ్‌లో ఆమెకు ప్రేమను వ్యక్తం చేసేందుకు కుర్రాళ్లు భయపడ్డట్లుగానే.. సినిమాల్లో కూడా ఆమెకు అవకాశం ఇచ్చేందుకు కొందరు వెనుకంజ వేస్తున్నారని సినీ జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.