//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మగాళ్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. నైటీ వేసుకున్న మ‌హిళ‌ల‌ను ప‌ట్టిస్తే డబ్బే.. డ‌బ్బు..!

Category : state

మగాళ్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. నైటీ వేసుకున్న మ‌హిళ‌ల‌ను ప‌ట్టిస్తే డబ్బే.. డ‌బ్బు..! అవును, ఆ గ్రామంలో అంతే. త‌మ‌కు, బ‌య‌టి స‌మాజానికి సంబంధం లేద‌నుకున్నారో.. ఏమో కానీ వారి నిబంధ‌న‌ల‌ను వారే రాసుకుంటున్నారు. ఎవ‌రు ఏం చేయాలి..? ఏం తినాలి..? ఎవ‌రు ఎటువంటి దుస్తులు ధ‌రించాలి..? అది కూడా ఏ స‌మ‌యంలో ధ‌రించాలి..? అన్న అంశాల‌పై సైతం వారు హుకుం జారీ చేసేస్తున్నారు. ఆ నేప‌థ్యంలో బ‌య‌ట‌కు వ‌చ్చిన అంశ‌మే ఇది.

మ‌హిళ‌లు ప‌గ‌లు నైటీ వేస్తే ఫైటే.. రూల్స్ పాటించ‌క‌పోతే అంతే సంగ‌తులు.. నైటీ వేసుకున్న‌ట్టు తెలిస్తే ఫైన్ వేస్తారో..? లేక వెలేస్తారో..? తెలీదు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా మిడ‌మ‌ర్రు మండ‌ల ప‌రిధిలోగ‌ల తోక‌ప‌ల్లి గ్రామంలో ప‌రిస్థితి ఇది. ప‌గ‌టి పూట నైటీలు వేసుకోవ‌ద్దంటూ ఊరి పెద్ద‌లు ఆంక్ష‌లు విధించారు. అంత‌టితో ఆగ‌కుండా, వారు మ‌హిళ‌ల‌పై విధించిన నిబంధ‌న‌లు స‌క్ర‌మంగా అమ‌లు అవుతున్నాయా..? లేవా..? అని తెలుసుకునేందుకు తొమ్మిది మందితో కూడిన క‌మిటీని కూడా నిమించారు.

ఇలా మ‌హిళ‌ల నైటీలకు సంబంధిచి తాము విధించిన‌ క‌ట్టుబాట్లను రాత్రి 7 నుంచి ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు విధిగా పాటించాల‌ని గ్రామ క‌మిటీ హుకుం జారీ చేసింది. అంతేకాకుండా, మ‌హిళ‌ల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ కోసం ప్ర‌తీ సంవ‌త్స‌రం తొమ్మిది మందితో కూడిన క‌మిటీని ఏర్పాటు చేస్తారు. ఈ క‌మిటీకి, స‌ర్పంచ్‌కు ఎలాంటి సంబంధం ఉండ‌దు. ఊరిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా క‌మిటీ స‌భ్యుల‌దే అధికారం.

తాజాగా ఏర్పాటైన క‌మిటీ ప‌గ‌టిపూట మ‌హిళ‌లు నైటీల‌ను ధ‌రించ‌డానికి వీలు లేద‌ని తీర్మానం చేశారు. నైటి వేసుకున్న మ‌హిళ‌కు 2వేల రూపాయ‌లు జ‌రిమానా విధించేలా నిర్ణ‌యించారు. అంత‌టితో ఆగ‌కుండా ఆ విష‌యాన్ని ఊరంతా దండోరా వేయించారు. అప్ప‌టి వ‌ర‌కు గుట్టుచ‌ప్పుడుగా ఉన్న ఈ క‌ట్టుబాటు ఒక్క‌సారిగా వార్త‌ల్లోకెక్కింది. అయితే, తోక‌ల‌ప‌ల్లిలో ఇటువంటి క‌ట్టుబాట్లు ఇప్ప‌టికిప్పుడే పుట్టుకు రాలేద‌ని, ఎప్ప‌ట్ట్నుంచో ఇటువంటి ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయ‌ని ఆ గ్రామ ప్ర‌జ‌లు చెబుతున్నారు.

తోక‌ల‌ప‌ల్లిలో మ‌గ‌వాళ్ల‌కు ఈజీగా డ‌బ్బులు సంపాదించుకునే ఒక స్కీమ్‌ను కూడా పెద్ద‌ల క‌మిటీ ప్ర‌క‌టించింది. రాత్రి 7 నుంచి ఉద‌యం 7 గంట‌ల మ‌ధ్య‌లో ఎవ‌రైనా మ‌హిళ నైటీ వేసుకున్న‌ట్టు గుర్తించి పెద్ద‌ల‌కు చెబితే వెయ్యి రూపాయ‌ల పారితోష‌కాన్ని అందుకోవ‌చ్చు. అయితే, ఈ ఆంక్ష‌ల‌ను పెట్టాల‌ని తామే కోరామ‌ని చెబుతున్నాడు గ్రామ మాజీ స‌ర్పంచ్. ఈ తోక‌ల‌ప‌ల్లిలో స‌ర్పంచ్ ఉన్నా ఆయ‌న ఉత్స‌వ విగ్ర‌హంగానే ఉంటారు. పెత్త‌న‌మంతా కుల పెద్ద‌లదే. వాళ్లు చెప్పిందే చ‌ట్ట‌మ‌క్క‌డ‌. ఆడ‌వాళ్లు ఎప్పుడు ఏ డ్ర‌స్సులు వేసుకోవాలో కూడా వాళ్లే నిర్ణ‌యిస్తారు. మ‌హిళ‌ల దుస్తుల‌పై ఆంక్ష‌లు పెట్టే పైత్యం తోక‌ల‌ప‌ల్లి గ్రామంలో మ‌రీ ఎక్కువ‌గా ఉంది. క‌ట్టుబాట్లు ఆచారాల పేరుతో మ‌హిళ‌ల‌పై దాష్టీకం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని మ‌హిళా సంఘాలు మండిప‌డుతున్నాయి.

అయితే, ప్ర‌పంచం నాగ‌రికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా కొన్ని గ్రామాలు మాత్రం క‌ట్టుబాట్లు అనే బానిస సంకెళ్ల‌తో ఇంకా మ‌గ్గుతూనే ఉన్నాయ‌న్న దానికి తోక‌ప‌ల్లి గ్రామ‌మే ఉదాహ‌ర‌ణ అని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇంకా ఎన్నాళ్లీ దాష్టీకం..? ఆడ‌వాళ్ల‌ప‌ట్ల ఎందుకీ వివ‌క్ష‌..? ఒక మ‌హిళ త‌నకు అనుకూలంగా ఉండే దుస్తులు ధ‌రిస్తే త‌ప్పా..? మ‌హిళ‌ల డ్ర‌స్‌ల‌పై నిషేధం విధించ‌డం ఏం నాగ‌రిక‌థ‌..? అంటూ వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌హిళ‌ల‌పై విధిస్తున్న ఇటువంటి అనాగ‌రిక‌పు క‌ట్టుబాట్ల గురించి ప్ర‌సార మాధ్య‌మాల ద్వారా తెలుసుకున్న పోలీసులు తోక‌ప‌ల్లి గ్రామానికి చేరుకున్నారు. విచార‌ణ‌లో భాగంగా అన్ని వివ‌రాల‌ను సేక‌రించారు. ఎప్ప‌ట్నుంచో ఇలాంటి క‌ట్టుబాట్లు ఉన్నా అధికారులు ప‌ట్టించుకోలేద‌ని మ‌హిళ‌లు వాపోతున్నారు.

Related News