//single page style gallary page

Nidhhi Agerwal Latest Tweet Goes Viral

Category : movies

Click here to read this article in Telugu

ఇస్మార్ట్ భామ తాజా ట్వీట్ పై నెటిజన్ల రచ్చ..!

ఈ మధ్య "ఇస్మార్ట్ శంకర్" తో బాక్స్ ఆఫీస్ వద్ద తొలి విజయాన్ని నమోదు చేసుకున్న భామ నిధి అగర్వాల్. తెలుగులో నటించిన మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కనుక ఈ మూవీ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉంది. ఈ జోష్ తోనే తాజాగా నిధి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక జోక్ పేల్చింది. ట్విట్టర్ అకౌంట్ లో హాట్ గా ఉండే ఒక ఫోటో పోస్ట్ చేసి, ఈ ఫోటోకు "ముంబైలో ఎవరికైనా గొడుగు కావాలా..పైనాపిల్ కావాలా?" అంటూ ట్వీట్ చేసింది.

గత వారం రోజులుగా భారీ వర్షాలు ముంబై నగరాన్ని పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ముంబైలో చాలా ఏరియాలు నీట మునిగాయి. ఇక స్కూల్సుకు, కాలేజీలకు, ఆఫీసులకు శెలవులు ప్రకటించారు. ఇలా ముంబైవాసులు నానా ఇబ్బందులు పడుతున్న సమయం లో ఇలా నాటీగా అడగడం సహజంగా ఎవరికైనా కోపం తెప్పిస్తుంది. రాంగ్ టైమ్ లో జోక్ వేయడం అంటే ఇదే మరి. అయితే జస్ట్ "ఎవరికైనా గొడుగు కావాలా లేక పైనాపిల్ కావాలా" అనే క్యాప్షన్ పెట్టి ఉంటే మాత్రం, ఎవరకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండేది.

ఎందుకంటే నిధి ధరించిన టాప్ పైన గొడుగు,పైనాపిల్ బొమ్మలు ఉన్నాయి. అయితే ఈ ఇక "గొడుగు కావాలా.. పైనాపిల్ కావాలా" ప్రశ్నను ఎక్కువమంది ముంబై వాసులు చూడలేదేమో కానీ ఇప్పటివరకూ ఎటువంటి ఘాటు రియాక్షన్లు అయితే రాలేదు. ఎక్కువమంది చిలిపి జవాబులు ఇచ్చారు. ఒకరు అయితే "అవి కెఎల్ రాహుల్ కు ఇచ్చావుగా!" అని కామెంట్ చేయగా.. మరొకరు "నేను బనానా ఇస్తా సలాడ్ చేసుకో" అంటూ టెంప్ట్ రవి తరహా పంచ్ రిప్లై ఇచ్చాడు. మరొకరు "అందరూ కశ్మీర్ ఇష్యూ తో కిందామీద అయిపోతుంటే నువ్వు పైనాపిల్స్ అమ్ముతున్నావా?" అంటూ కసురుకున్నాడు. అయితే విచిత్రంగా ఎక్కువమంది రిప్లైస్ లో రెండు పైనాపిల్స్ అడిగారు, ఎందుకో మరి. ఇలా నిధి షేర్ చేసిన పోస్ట్ కు వారివారి శైలిలో రిప్లైస్ ఇచ్చారు.

Meanwhile , Bhama Nidhi Agarwal has made his debut at the box office with " Ismart Shankar ". Since the first two films in Telugu have flopped , this movie has been on good Josh with success. The latest treasure has exploded into a joke with his Twitter account. Posting a photo that was hot on his Twitter account, he captioned the photo, "Does anyone in Mumbai need an umbrella..pinapil?" Tweeted.

Heavy rains have plagued Mumbai for the past week. Many aerials are submerged in Mumbai. Holidays for schools, colleges and offices are announced. Naturally, when people in Mumbai are in trouble, it is upsetting to ask. Wrong time is a joke. But if the caption "Just want an umbrella or a pineapple" was put in place, there would be no trouble for anyone.

This is because there are umbrella and pineapple dolls on top of the treasure chest. However, this is no longer the "umbrella .. want pineapple" question that most Mumbai people have seen but so far no serious reactions have come up. Most people answered pranks. If one says "They gave it to KL Rahul !" Another commented, "I am Banana Ista Salad" and tempted Ravi's style of punch. Another said, "Are you selling pineapples if everybody gets tired of the Kashmir issue?" He asked. But strangely more people have asked for two pineapples in the replice , because more. Nidhi shared the post in their style.