//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేరళలో లవ్ జిహాద్‌పై ఎన్ఐఏ విచార‌ణ‌

Category : national

కేర‌ళలో ఒక యువతీ మత మార్పిడికి దారితీసిన  `లవ్ జిహాద్‌'పై నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) విచార‌ణ‌కు సుప్రీంకోర్టు ఆదేశించింది. గ‌తేడాది ఓ హిందు మ‌హిళ అఖిల (24)ను మత మార్పిడికి  గురిచేసి, ఆమె పేరును హదీయ గా మార్చి ముస్లిం యువ‌కుడు షెఫైన్ జహాన్ పెళ్లి చేసుకున్నాడు.  `లవ్ జిహాద్' ను ఉటంకిస్తూ   ఈ పెళ్లి చెల్లుబాటు కాదని కేరళ హై కోర్ట్ మే 24న తీర్పు ఇచ్చింది. పైగా మతం మార్చి పెళ్లి చేసుకోవడం మహిళా స్వతంత్రానికి అవమానకరమని స్పష్టం చేసింది.

అయితే ఇదొక్క‌టే కాద‌ని, కేర‌ళ‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలానే ఉన్నాయ‌ని ఎన్ఐఏ ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ విషయమై  సుప్రీం కోర్ట్ కు నివేదిక సమర్పించడానికి సహకరించమని ఇదివరలో కేరళ పోలీస్ లను ఆదేశించింది. పైగా, ఈ కేసులో తమ కుమార్తెను ఉగ్రవాద సంస్థ ఐ యస్ లో చేర్పించడం కోసం `పెళ్లి' నాటకం ఆడారని తల్లితండ్రులు ఆరోపించారు.

ఎన్ఐఏ విచార‌ణ తీరును ప‌రిశీలించ‌డానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు జ‌డ్జి ఆర్వీ ర‌వీంద్ర‌న్ నేతృత్వంలో ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది చీఫ్ జ‌స్టిస్ జేఎస్ ఖేహార్‌, జ‌స్టిస్ చంద్ర‌చూడ్‌ల ఆధ్వ‌ర్యంలోని సుప్రీం ధ‌ర్మాస‌నం. ఆ మ‌హిళ మ‌తం మార్చుకోవ‌డం, ముస్లిం యువ‌కుడిని పెళ్లి చేసుకున్న ఘ‌ట‌న‌లో ప్ర‌ముఖ పాత్ర పోషించిన వ్య‌క్తులే ఇలాంటిదే మ‌రో ఘ‌ట‌న‌లోనూ ఉన్నార‌ని త‌మ దృష్టికి వ‌చ్చిన‌ట్లు ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది.

ఈ విచార‌ణ‌ను ఏజెన్సీకి అప్ప‌గించ‌డానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కేర‌ళ పోలీసుల త‌ర‌ఫున హాజ‌రైన సీనియ‌ర్ అడ్వొకేట్ వీ గిరి కోర్టుకు స్ప‌ష్టంచేశారు. ఇప్ప‌టికే కేర‌ళ పోలీసులు ఓ సిట్‌ను ఏర్పాటు చేసి ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు.