//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఉగ్రవాద వాట్సాప్ గ్రూప్ లో కేరళ యువకులు

Category : national

కేరళలోని కసర్‌గడ్ నుంచి అదృశ్యమై ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)లో చేరిన 14 మంది యువకులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) చేస్తున్న విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న ఓ వాట్సాప్ గ్రూపులో కసర్‌గడ్‌కు చెందిన కొందరి వ్యక్తుల ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. కసర్‌గడ్‌లోని మిత్రులతో ‘టచ్’లో ఉండేందుకే ఉగ్రవాదులు ఈ వాట్సాప్ గ్రూపును రూపొందించి ఉంటారని ఎన్ఐఏ అనుమానిస్తున్నారు. గ్రూపులో ఉన్న కొందరిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ ఈ విషయమై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆఫ్ఘాన్ నుంచి ఆపరేట్ అవుతున్న వాట్సాప్ గ్రూప్‌ను కసర్‌గడ్‌కు చెందిన అబ్దుల్ రషీద్ ఆఫ్ఘనిస్థాన్‌లో తీసుకున్న మొబైల్ నంబరుతో ప్రారంభించినట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఈ గ్రూపులో గ్రామంలో తనకు పరిచయమున్న వ్యక్తులను రషీద్ చేర్చాడు. కేరళ నుంచి 21 మంది యువకులను ఆఫ్ఘనిస్థాన్‌కు తరలించినట్టు రషీద్‌పై ఆరోపణలున్నాయి. వాట్సాప్ ద్వారా గ్రామంలోని మరి కొంతమందికి వల వేసి ఐసిస్‌వైపు ఆకర్షించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.