//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నెక్స్ట్ ఏంటి టీజర్ రివ్యూ

Category : movies

బాలీవుడ్ డైరెక్టర్ ‘ఫనా’ ఫేమ్ కునాల్ కోహ్లీ దర్శకత్వంలో ‘నెక్ట్స్ ఏంటి ? మూవీ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసారు ఈ మూవీ మేకర్స్. ఈ మూవీలో వరుస ఫ్లాపుల్లో ఉన్న సందీప్ కిషన్ హీరోగా , తమన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు . మరోవైపు హీరోగా ఫామ్ కోల్పోయిన నవదీప్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు

ఈ టీజర్ చూస్తుంటే...ఇప్పటి జనరేషన్ తగ్గ ఫీల్ గుడ్ యూత్ లవ్ స్టోరీ అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది . అబ్బాయిలందరూ...అమ్మాయిల్లో కోరుకునేది అదే అనే డైలాగ్ యూత్‌ను అట్రాక్ట్ చేసే విధంగా ఉంది . మరోవైపు హీరో క్యారెక్టర్ కూడా ఛాన్స్ దొరికితే అమ్మాయిలను కుమ్మేయాలనే ప్లే బాయ్ తరహా పాత్ర అని టీజర్ చూస్తేనే అర్థమౌతుంది . లైఫ్ చాలా చిన్నది రా మల్లి మల్లి అవకాశాలు రావు , అందులో అమ్మాయిల విషయం లో అసలు రావు , సో ఒక్క ఛాన్స్ వస్తే వదలకూడదంటూ సందీప్ చెప్పే డైలాగ్ యువత ని బాగా ఆకట్టుకుంటుంది . ఈ మూవీని డిసెంబర్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు చిత్ర నిర్మాతలు . మొత్తానికి యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీతో హీరోయిన్‌గా తమన్నా...హీరోగా సందీప్ కిషన్‌లు హిట్టు అందుకుంటారా లేదా అనేది తెలియాలంటే ఈ మూవీ విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.

For all the latest Entertainment News,Political News Follow us On facebook