//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కాబోయే సీఎం నారా లోకేశ్ : కేశినేని నాని

Category : state politics

నాలుగు నెలల ముందుగానే ఏపీ లో ఎన్నికల వేడి కనిపిస్తుంది. ఎవరికివారు ప్రచారాలు భారీస్థాయిలో చేస్తున్నారు. ఎలాంటి ఎన్నికల సమయంలో కేశినేని ఓ సంచలనమైన వ్యాఖ్య చేశారు. అదేంటంటే భవిష్యత్తులో చంద్రబాబు తరువాత నారా లోకేశ్ సీఎం అవుతారని ఆయనకు ఆ అర్హత నూటికి నూరు శాతం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు.

కృష్ణా జిల్లా చింతలపాడులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిచండం మొదలు పెట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, టీడీపీయే అధికారంలో ఉండాలని అన్నారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలుంటే, అధికారులకు తెలియజేయాలని, తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యనూ పరిష్కరిస్తున్నామని చెప్పారు. జన్మభూమి ద్వారా ప్రజా ప్రతినిధులను ప్రజల ముందు తీసుకు వచ్చి నిలిపిన ఘనత చంద్రబాబుదేనని కేశినేని నాని వ్యాఖ్యానించారు.రాష్ట్రంలో కరెంటు కోతలు లేకుండా చేసారని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన మాటలను ఇంకా సహించబోయేది లేదని చెప్పారు. మోదీకి సమాధానం చెప్పేందుకు తానొక్కడే సరిపోతాడని అన్నాడు.