//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Category : sports

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి చెందాడు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. 1965లో క్రికెట్‌లో అరంగేట్రం చేసిన ఆయన తన 13 ఏళ్ల కెరీర్‌లో మొత్తం 61 టెస్టులు ఆడారు.

నంబరు 3లో బ్యాటింగ్‌కు దిగడాన్ని ఇష్టపడే బెవాన్ 32.22 సగటుతో మొత్తం 3448 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు ఉన్నాయి. 17 టెస్టులకు సారథ్య బాధ్యతల వహించిన బెవాన్ ఆస్ట్రేలియాపై తొలి టెస్టు విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

11 వన్డేల్లో 56.33 సగటుతో ఐదు అర్ధ సెంచరీలు, ఓ సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్ తరపున పది ఇన్నింగ్స్‌లలో ఇప్పటికీ ఇదే అత్యుత్తమ సగటు. స్ట్రైక్ రేటు 71.61. బెవాన్ మృతి విషయం తెలిసి న్యూజిలాండ్ అభిమానులు, జట్టు సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.