క్యాలెండర్ మారింది. 2018 వచ్చేసింది. యావత్ ప్రపంచం ఈ కొత్త సంవత్సరాన్ని కొంగొత్త ఉత్సాహంతో స్వాగతించింది. బాణసంచా వెలుగులు, విద్యుత్ దీపాల సొగబులతో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
2017 మధురానుభూతులను గుర్తుకు తెచ్చుకుంటూ 2018కి ఆహ్వానం పలుకుతున్నారు.
* ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2018 ప్రతి కుటుంబానికి, మన దేశానికి శ్రేయస్సు, ఆనందం కలిగించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా - రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
* నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2018 ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు తీసుకురావాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా - ప్రధాని మోదీ
* హ్యాపీ న్యూ ఇయర్ - కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్* ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, ఆనందం, శాంతి సౌభ్రాతృత్వాలను తీసుకురావాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు - కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ
* సైన్యం, పోలీసులు నిరంతరం శ్రమించడం వల్లే మనమంతా సుఖశాంతులతో జీవిస్తున్నాం. వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్
* ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు - కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ * తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
* తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం అందరికీ చిరస్మరణీయం కావాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నా - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు * నవ్వండి..
నవ్వండి.. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్ - పశ్చిమ్‌బంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ.