'దంగల్' నటి జైరా వసీమ్‌కు విమానంలో లైంగిక వేధింపులు...వీడియో వైరల్

Posted a month ago | Category : national

దంగల్' నటి జైరా వాసీం (17)కు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. విస్టారా ఎయిర్ లైన్స్‌లో జైరాను ఓ ప్రయాణీకుడు వేధించాడు. ఢిల్లీ - ముంబై ఫ్లైట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణమైన అనుభవంపై తన ఆవేదనను ఆమె ఆదివారం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఈ వివరాలను తెలిపారు.

దీనిపై ఆమె స్పందిస్తూ, తాను ఎయిర్ విస్తారా విమానంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్తుండగా.. తన సీటుకు ఉన్న ఆర్మ్ రెస్ట్‌పై తన వెనుక కూర్చున్న ప్రయాణికుడు కాలు పెట్టాడని జైరా వాసీం వెల్లడించారు. దీనికి తాను అభ్యంతరం తెలిపానన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితి ఉండటం వల్ల తన కాలును అక్కడ పెట్టానని అతను చెప్పాడని తెలిపారు.

అనంతరం తాను నిద్రపోతున్న సమయంలో తన మెడపై ఆ వ్యక్తి తన కాలితో తడిమాడని, ఆ విషయాన్ని తాను గ్రహించిన తర్వాత, ఆ దృశ్యాన్ని రికార్డు చేయడానికి ప్రయత్నించానని చెప్పారు. అయితే విమానంలో కాంతి తక్కువగా ఉన్నందువల్ల ఆ భయానక దృశ్యాలను రికార్డు చేయలేకపోయానన్నారు. కానీ కొంతవరకు ఆ దుర్మార్గుడి దుశ్చర్యను రికార్డు చేయగలిగినట్లు తెలిపారు.

అయితే దీనిపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. అలాగే జాతీయ మహిళా సంఘం కూడా సీరియస్‌గా స్పందించింది. దీనికి సంబంధించిన వీడియోను జైరా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. దీనిపై విస్తారా యాజమానాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ వివరణ కోరింది. ముంబైలో వసీమ్ బస చేస్తున్న హోటల్‌కి వెళ్లిన పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు.


మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

Posted a day ago | Category : national

మోడీకి షాక్ ఇవ్వనున్న శివసేన

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted a day ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 2 days ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 2 days ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 3 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 3 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 4 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 6 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 6 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 8 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 8 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!