జగన్ పాదయత్ర ఫిక్స్ ..ఆరు నెలలు...125 నియోజకవర్గాలు : మేకపాటి

Posted 4 months ago | Category : politics

ప్రజాసంకల్పం పేరుతో శ్రీ వైయస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఆరు మాసాలు 180 రోజులు 125 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రయాణం చేయనున్నారు. తర్వాత మిగిలిన 50 నియోజకవర్గాల్లో శ్రీ వైయస్ జగన్ బస్సు యాత్ర చేపడతారు.13 జిల్లాల్లో దాదాపు 3వేల కి.మీ.కు పైగా పాదయాత్ర. దారివెంట 5వేలకు సమావేశాలు, 180 ప్రభావిత సమావేశాలు, 125 భారీ బహిరంగ సభలు, లక్షకు పైగా నివాస ప్రాంతాలను శ్రీ వైయస్ జగన్ పాదయాత్రలో కవర్ చేస్తారు.ప్రత్యక్షంగా 45 లక్షలకు పైగా ప్రజలతో సమావేశాలు, చర్చిస్తారు. రెండు కోట్లకు పైగా ప్రజల్ని ప్రభావితం చేసే అవకాశం. అంతేకాకుండా దారివెంట విస్త్రతమైన కార్యక్రమాలు, ప్రభావిత సంఘ సమావేశాలు, భారీ బహిరంగ సభలు, విభిన్నమైన కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు, విభిన్నమైన ముద్ర వేసే కార్యక్రమాలు జరుగుతాయి.

మిగిలిన నియోజకవర్గాల్లో నియోజకవర్గ కోఆర్డినేటర్స్ రచ్చబండ అనే కార్యక్రమం చేస్తారు. 175 నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. 120 రోజుల పాటు ప్రతినియోజకవర్గంలో శాసనసభ్యుడు, కో ఆర్డినేటర్ ఈ రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రత్యేక హోదా కోరుతూ సంతకాల సేకరణ చేపడతారు. రాష్ట్రవిభజన చేస్తూ ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ వాగ్ధానం చేశారు. దాన్ని తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంపై ఉంది. అది రాష్ట్రప్రభుత్వం తేవాల్సిన బాధ్యత ఉంది. చంద్రబాబు రాజకీయకారణాలతో ప్రత్యేక హోదా బదులు.. ప్రత్యేక ప్యాకేజీ అంటున్నారు. ఆ ప్యాకేజీ వల్ల ఏపీ ఏ విధంగా లబ్ధిపొందిందో మనకు తెలీదు. హోదా వచ్చి ఉన్నట్లైతే రాష్ట్రం బాగుపడి ఉండేది. రాష్ట్రఆర్థిక పరిస్థితులు బాగుపడి ఉండేవి. పొరుగు రాష్ట్రాల వల్లే మనం కూడా అన్నివిధాలా అభివృద్ధికార్యక్రమాలు చేసుకుని ఉండేవాళ్లము. చంద్రబాబు ప్రజల్ని మెస్మరిజం చేయాలని చూసి తీరని చేటు చేశారని రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు.

ప్రత్యేక హోదా సాధించకపోవటం దుర‌దృష్టక‌ర‌మ‌న్నారు. 5 కోట్ల ప్రజల హక్కును చంద్రబాబు కాలరాశారు. నీ కుటుంబం,నీ హక్కులు చూసుకుంటున్న చంద్రబాబు రాష్ట్ర ప్రజల బాగోగులు కాలరాశారు. ప్రత్యేక హోదా వచ్చినట్టైతే ప్రతి కుటుంబం బాగుపడేది. తద్వారా రాష్ట్రమూ బాగుపడేది. పారిశ్రామిక రంగం పెరిగితే రాష్ట్రమూ బాగుపడేది. ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చంద్రబాబు చేశారు. ప్రత్యేక హోదా సాధించుకునే హక్కు మనమీద ఉంది. అందుకే రచ్చబండ కార్యక్రమంలో ప్రత్యేక హోదా కోరుతూ సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయించామన్నారు. అంతేకాకుండా నియోజకవర్గ రచ్చబండ కార్యక్రమంలో అక్కడ 30 కీలక గ్రామాల్లో నిర్వహించాల్సి ఉంటుంది. ముఖ్యమైన సామాజిక వర్గాల నేతలను కలవటంతో పాటు బూత్ కమిటీలు బలపర్చటం ముఖ్యమైన వ్యవహారంగా నిర్ణయించామన్నారు. వైయస్ఆర్ సీపీలో కీలకంగా ఉండే వారితో బూత్ కమిటీలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నాలుగు మాసాల్లో ఆ నియోజకవర్గాల్లో శాసనసభ్యుడు, కోఆర్డినేటర్ గడపగడపకు వెళ్లి అక్కడ కుటుంబ సభ్యులతో మమేకమై వారి కష్టసుఖాలు తెల్సుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి గడపా తొక్కాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో దేవుడి దయ వల్ల, ప్రజల ఆశ్శీసులతో శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోజు దివంగత మహానేత వైయస్ఆర్ పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెల్సుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా మేకపాటి గుర్తు చేశారు. ఆ విధంగా శ్రీ వైయస్ జగన్ గారు ప్రజల ఆశీర్వాద బలంతో ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజాక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. కులమతాలకు అతీతంగా 5 కోట్ల ప్రజలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా సంక్షేమకార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని మేకపాటి తెలిపారు. అందుకనే ఈ రోజున కోఆర్డినేటర్ అందరూ గడపగడపకూ వెళ్లటమే కాకుండా పల్లెనిద్ర చేయమని శ్రీ వైయస్ జగన్ ఆదేశించారన్నారు.

తద్వారా ప్రజలతో మమేకం అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వాళ్ల నియోజకవర్గాల్లో ఉండే కాలేజీలు, విద్యాసంస్థల్లో విద్యార్థులతో మమేకమై వారి పరిస్థితి తెల్సుకొని ప్రభావితం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా కోఆర్డినేటర్, శాసనసభ్యుడు ప్రత్యేక హోదా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హోదా లాభాలను విద్యార్థులు, యువతకు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రచ్చబండ కార్యక్రమంలో 175 నియోజకవర్గాల్లో కోటి మంది ప్రజల్ని కలుసుకోవాల్సి ఉందన్నారు. తద్వారా ప్రజల మన్నలు, ప్రేమాభిమానాలు పొందాలన్నారు. ప్రజలతో మమేకమే, వారి మన్నలు, ప్రేమాభిమానాలు చూరగొన్ననాడే ప్రతి ఒక్కరం గెలవగలమని మేకపాటి అన్నారు. తద్వారా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలవచ్చు అన్నారు. మొదటి నాలుగు మాసాల్లో రచ్చబండ కార్యక్రమాలు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. తర్వాత రెండునెలల్లో ఏం చేయాలి.. వేగంగా ప్రజలతో ఎలా మమేకమవ్వాలో పార్టీ పెద్దలు, శ్రీ వైయస్ జగన్ తర్వాత నిర్ణయిస్తారని మేకపాటి స్పష్టం చేశారు.

రచ్చబండ 2లో గ్రామంలో ప్రతి గడపనూ సందర్శించటంతో పాటు సంతకాల సేకరణ, పల్లె నిద్రలో భాగంగా స్థానికుల ఇంట్లో నిద్రించి స్థానిక ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు.ఏ ఇంట్లో నిద్రపోవాలో వ్యూహాత్మకంగా నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాల సమావేశాలు అనేది ప్రతి నెలా రెండు చోట్ల నిర్వహించాలన్నారు.

వైయస్ఆర్ సీపీ నుంచి ఫిరాయింపులు అనైతికం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీదా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను, ఎంపీలను చంద్రబాబు కొనుగోలు చేశారన్నారు. ప్రతి ఒక్కరూ దానికొరకు ప్రయత్నం చేయాలన్నారు. ముఖ్యమంత్రో, ప్రతిపక్ష నేతో చేయటం కాదు. ప్రజాస్వామ్యం అనేది ప్రజల హక్కు అని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉందన్నారు. చంద్రబాబు చేస్తున్న అప్రజాస్వామిక విధానాలనూ ఖండించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీదా ఉందన్నారు. శ్రీ వైయస్ జగన్ గారు చేయబోతున్న పాదయాత్ర విజయవంతం కావాలని మేకపాటి కోరారు. దివంగత మహానేత వైయస్ఆర్ చెప్పిన వాగ్ధానాలే కాకుండా చెప్పనవి కూడా చేశారన్నారు. శ్రీ వైయస్ జగన్ గారిని కూడా ప్రజలు ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇచ్చినట్టైతే ఆయన కూడా మంచి కార్యక్రమాలు రూపొందించుకొని చేస్తారన్నారు. శ్రీ వైయస్ జగన్ ఫెర్ఫ్మార్మెన్స్ ప్రజలు చూడాలన్నారు. ఇప్పటివరకు చంద్రబాబు పాలన చూశారు. రాజధాని పేరుతో ప్రజల్ని చంద్రబాబు మభ్యపెట్టాలని చూశారన్నారు. శ్రీ వైయస్ జగన్ చేయనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని, ఆశీర్వదించాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరారు. అన్ని విషయాలనూ ప్రజలు గమనించాలని ఆయన కోరారు.


రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 19 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 20 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 21 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 21 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted a day ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted a day ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted a day ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted a day ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

Posted 2 days ago | Category : politics

విభజన చట్టం అమలు చేసే ఉద్దేశం కేంద్రానికి లేదుఅని అంటున్న ఉండవల్లి ..!

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

కాంగ్రెస్ నేతలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు