బాబు బాహుబలి ఐతే పవన్ కట్టప్ప......నిప్పులు చెరిగిన రోజా

Posted 2 months ago | Category : politics

అటు జనసేన, ఇటు టీడీపీఫై తన మాటల తూటాలతో విమర్శల వర్షం కురిపించారు వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా.‘జనసేన’ కాదు..చంద్రబాబుకు ‘భజనసేన’ అంటూ ఆమె విమర్శలు గుప్పించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ఉండేది తల్లి టీడీపీ అయితే, ఈ ‘జనసేన’ పిల్ల టీడీపీ అని చెప్పొచ్చు.

‘అనుభవం లేని వాళ్లు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకోకూడదు’ అని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రోజా మండి పడ్డారు. అనుభవంలేని నారా లోకేశ్ ఎమ్మెల్సీ అయి, మంత్రి అవడం కరెక్టా? అని ప్రశ్నించారు. అంతేకాదు పవన్‌ది "జనసేన" కాదు-"భజన సేన" అని ఆమె విరుచుకుపడ్డారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు లాంటి వాళ్లకు పవన్ కల్యాణ్ భజన చేస్తారు, వాళ్లను తన భుజాలపై పవన్ మోస్తారంటూ విరుచుకుపడ్డారు.

పవన్ కళ్యాణ్ మాటలకు, చేతలకూ పొంతన ఉండదనీ, చంద్రబాబు ఎప్పుడు అవినీతి లో ఇరుక్కున్నా, తెరమీదకు పవన్‌ కళ్యాణ్ ను తెచ్చి విషయాన్ని పక్కదోవ పట్టిస్తారని రోజా దుయ్యబట్టారు. వైసీపీ పార్టీ పెట్టకముందే, జగన్ ఎంపీ అయ్యారని, వాళ్ల నాన్న ఉన్నప్పుడు జిల్లా బాధ్యతల కూడా ఆయన చూసుకునే వారని, రాజకీయంగా ఆయనకు అనుభవం ఉందని రోజా అన్నారు. రాజకీయ ఏ అనుభవం ఉందని నాడు చిరంజీవి గారు, పవన్ కల్యాణ్ పార్టీ స్థాపించారని ఆమె ప్రశ్నించారు.


పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

Posted 3 hours ago | Category : politics

పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

నెల్లూరులో జగన్...

Posted 3 hours ago | Category : politics

నెల్లూరులో జగన్...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 19 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 20 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted a day ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted a day ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted 2 days ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 2 days ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ