మరో సైబర్ దాడితో ఉలిక్కి పడిన ప్రపంచం

Posted 7 months ago | Category : world

అనేక దేశాల్లో మరో అతిపెద్ద సైబ‌ర్ దాడి తో ప్రపంచం ఉలిక్కి పడింది.  అనేక దేశాల్లో సైబ‌ర్ దాడులు జ‌రిగిన‌ట్లు ప‌లు కంపెనీలు పేర్కొన్నాయి. దాడికి గురైన దాంట్లో బ్రిటీష్ అడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీ డ‌బ్ల్యూపీపీ ఉంది. బ్రిట‌న్‌కు చెందిన అనేక కంపెనీల‌పైన ఈసారి కూడా భారీ ఎత్తున సైబ‌ర్ అటాక్ జ‌రిగింది. ఉక్రెయిన్‌కు చెందిన ప్ర‌భుత్వ విద్యుత్తు స‌ర‌ఫ‌రా సంస్థ‌తో పాటు రాజ‌ధాని కీవ్‌లో ఉన్న ప్ర‌ధాన‌ ఎయిర్‌పోర్ట్‌పైన కూడా దాడి జ‌రిగింది. 

గ‌త నెల‌లో జ‌రిగిన వ‌న్నాక్రై లాంటి రాన్స‌మ్‌వేర్ వైర‌స్‌తోనే దాడి చేసి ఉంటార‌ని కొంద‌రు నిపుణులు భావిస్తున్నారు. కొన్ని సంస్థ‌లు త‌మ‌ నెట్‌వ‌ర్క్ డౌనైట్లు వెల్ల‌డించాయి. ఉక్రెయిన్ సెంట్ర‌ల్ బ్యాంక్‌, విమాన త‌యారీ సంస్థ ఆంట‌నోవ్‌, పోస్టల్ స‌ర్వీస్‌, ర‌ష్యా ఆయిల్ సంస్థ రోజ్‌నెఫ్ట్‌, డానిష్ షిప్పింగ్ కంపెనీ మెయ‌ర్స్క్ లాంటి సంస్థ‌ల‌పై సైబ‌ర్ దాడులు జ‌రిగాయి. 

స్పెయిన్‌లో కూడా సైబ‌ర్ దాడులు జ‌రిగాయి. ఆ దేశానికి చెందిన బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌ను హ్యాక్ చేశారు. ఫుడ్ గెయింట్స్ మోండెలెజ్‌, లీగ‌ల్ ఫ‌ర్మ్ డీఎల్ఏ పైప‌ర్ సంస్థ‌ల‌పై సైబ‌ర్ దాడి జ‌రిగింది. ఫ్రాన్స్‌కు చెందిన నిర్మాణ‌రంగ సంస్థ సెయింట్ గోబెయిన్‌పైన కూడా ప్ర‌భావం ప‌డిన‌ట్లు తెలుస్తున్న‌ది. 

ఇటీవ‌ల బ్రిట‌న్ వైద్య వ్య‌వ‌స్థ‌ను టార్గెట్ చేస్తూ రాన్స‌మ్‌వేర్‌తో దాడి చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ఎక్కువ‌గా ఉక్రెయిన్‌ను టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది. కీవ్ న‌గ‌రంలో మెట్రో సిస్ట‌మ్ పేమెంట్ కార్డుల‌ను అంగీక‌రించ‌డం లేదు. పెట్రోల్ స్టేష‌న్లు కూడా ప‌నిచేయ‌డం ఆపేశాయి. ప్ర‌భుత్వ కంప్యూట‌ర్లు కూడా హ్యాక్‌కు గురైన‌ట్లు ఉక్రెయిన్ డిప్యూటీ పీఎం పేర్కొన్నారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!