జీలం, చీనాబ్ న‌దుల‌పై పాక్ కు ప్రపంచ బ్యాంక్ షాక్

Posted 6 months ago | Category : world

సింధు న‌దీ జ‌లాల ఒప్పందం విష‌యంలో ప్రపంచ బ్యాంక్ భారత్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది. జీలం, చీనాబ్ న‌దుల‌పై హైడ్రోఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్స్ నిర్మించుకునే హ‌క్కు భారత్ కు ఉంద‌ని తేల్చి చెప్పింది. ఈ విష‌యంలో పాకిస్థాన్ వాద‌న‌ను తోసిపుచ్చింది.

ఇందులోని సాంకేతిక అంశాలపై భారత్ , పాకిస్థాన్ కార్య‌ద‌ర్శి స్థాయి చర్చ‌ల త‌ర్వాత ప్రపంచ  బ్యాంక్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. దీనిపై చ‌ర్చ‌లు ఇంకా కొన‌సాగుతాయ‌ని, సెప్టెంబ‌ర్‌లో మ‌రోసారి క‌ల‌వ‌డానికి రెండు దేశాలు అంగీక‌రించాయ‌ని ప్రపంచ బ్యాంక్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

సింధు జ‌లాల ఒప్పందంలో భాగంగా జీలం, చీనాబ్ న‌దుల‌పై కిష‌న్‌గంగా (330 మెగావాట్లు), రాట్లె (850 మెగావాట్లు) హైడ్రోఎల‌క్ట్రిక్ ప‌వ‌ర్ ప్లాంట్స్‌ను నిర్మించే అవ‌కాశం భారత్ కు ఉంది. అయితే ఈ రెండు ప్రాజెక్టుల డిజైన్ ఒప్పందానికి వ్య‌తిరేకంగా ఉన్న‌ద‌ని పాకిస్థాన్ వాదిస్తున్న‌ది. 

ఒప్పందం ప్ర‌కారం ప‌శ్చిమ న‌దులైన సింధుతోపాటు జీలం, చీనాబ్ న‌దుల్లోని జ‌లాల‌ను పాకిస్థాన్ వాడుకోవ‌చ్చు. అయితే ఒప్పందంలోని ప‌లు నియంత్ర‌ణ‌ల‌కు లోబ‌డి ఈ రెండు న‌దుల‌పై జ‌ల విద్యుత్ కేంద్రాలు నిర్మించుకునే అవ‌కాశం భారత్ కు ఉన్నాడని ప్రపంచ బ్యాంక్ స్ప‌ష్టం చేసింది. ప్రపంచ బ్యాంక్ మ‌ధ్య‌వ‌ర్తిత్వంతోనే 1960లో భారత్, పాకిస్థాన్ మ‌ధ్య సింధు జ‌లాల ఒప్పందం కుదిరింది.

ఈ రెండు ప్రాజెక్టుల డిజైన్‌ల‌పై త‌మ‌కు ఉన్న ఆందోళ‌న‌ల‌ను నివృత్తి చేసుకోవ‌డానికి ఆర్బిట్రేష‌న్ ఏర్పాటు చేయాల్సిందిగా పాకిస్థాన్ ప్రపంచ బ్యాంక్‌ను కోరింది. దీనికోస‌మే ఓ త‌ట‌స్థ నిపుణున్ని ఏర్పాటుచేయాల‌ని భారత్  కూడా సూచించింది.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!