జోరుగా పెరిగిన బంగారం గిరాకీకి జీఎస్టీ చెక్ ?

Posted 7 months ago | Category : business

భారత్‌లో బంగారానికి గిరాకీ జోరుగా పెరిగింది. ప్రజలకు నగదు అందుబాటులోకి రావడం, వర్షాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాలు వంటివి బంగారంపై సెంటిమెంట్‌ సానుకూలంగా మారేందుకు దోహదపడ్డాయని భావిస్తున్నారు. దానితో అక్షయ తృతీయ సందర్భంగా ఈ సంవత్సరం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అయితే జులై నుండి అమలులోకి వచ్చిన జీఎస్టీ కారణంగా వర్షాలు మెరుగుగా ఉన్నప్పటికీ బంగారం పట్ల వినియోగదారులతో ఆసక్తి తగ్గే అవకాశాలు ఉన్నట్లు వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో బంగారం డిమాండ్‌ 37 శాతం పెరిగి 167.4 టన్నులకు చేరుకుంది. సీజనల్‌ డిమాండ్‌తో పాటు గ్రామీణ ప్రాంత సెంటిమెంట్‌లో పురోగతి వంటి అంశాలు పసిడి డిమాండ్‌ పెరుగుదలకు దోహదపడ్డాయని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యుజిసి) తన గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ నివేదికలో తెలిపింది.

గత ఏడాది ఏప్రిల్‌-జూన్‌లో బంగారం డిమాండ్‌ 122.1 టన్నులు మాత్రమే ఉంది. ద్వితీయ త్రైమాసికంలో విలువపరంగా బంగారం డిమాండ్‌ 32 శాతం పెరిగి రూ  43,600 కోట్లకు చేరుకుంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇది రూ 33,090 కోట్లుగా ఉంది. రెండో త్రైమాసికంలో బంగారం డిమాండ్‌ పెరిగినప్పటికీ ఐదేళ్ల సగటుకన్నా తక్కువే ఉంది. జిఎ్‌సటి అమలు నేపథ్యంలో చాలా మంది ముందస్తుగానే బంగారం కొనుగోళ్లకు దిగడం వల్ల డిమాండ్‌ పెరిగే అవకాశం ఏర్పడినట్టు డబ్ల్యుజిసి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పిఆర్‌ సోమసుందరమ్‌ తెలిపారు.

బంగారపు ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్‌సుంకాన్ని విఽధించడాన్ని నిరసిస్తూ ఆభరణాల తయారీదారులు సమ్మె నిర్వహించిన ఫలితంగా అమ్మకాలపై కొంత మేర ప్రభావం పడినట్టు ఆయన చెప్పారు. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో దేశీయంగా జువెలరీ డిమాండ్‌ 41 శాతం పెరిగి 89.8 టన్నుల నుంచి 126.7 టన్నులకు చేరుకుంది. విలువపరంగా ఆభరణాల డిమాండ్‌ 36 శాతం వృద్ధి చెంది 24,350 కోట్ల రూపాయల నుంచి 33,000 కోట్ల రూపాయలకు చేరింది.

ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో బంగారంలో పెట్టుబడుల డిమాండ్‌ 26 శాతం పెరిగి 32.3 టన్నుల నుంచి 40.7 టన్నులకు చేరుకుంది. విలువపరంగా బంగారంలో పెట్టుబడుల డిమాండ్‌ 21 శాతం వృద్ధితో 8,740 కోట్ల రూపాయల నుంచి 10,610 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఏప్రిల్‌-జూన్‌లో 29.6 టన్నుల బంగారాన్ని రీసైకిల్‌ చేశారు.


పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

Posted 11 days ago | Category : business

పేమెంట్ ఫీచర్ తో వాట్సాప్.......!

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

Posted 12 days ago | Category : business

532 కోట్ల నష్టం లో ఆంధ్ర బ్యాంకు.......!

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

Posted 12 days ago | Category : business

500 రూపాయలకే 4g మొబైల్......జియో కాదు.....!

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

Posted 12 days ago | Category : business

అమెరికా మార్కెట్లు మళ్లీ ఢమాల్‌..!

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

Posted 14 days ago | Category : business

32 వేల కోట్లు నష్టపోయిన అమెరికా కుబేరుడు..!

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

Posted 15 days ago | Category : business

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు..

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్ సర్ జి..!

Posted 19 days ago | Category : business

ఐడియా సూపర్ ఫాస్ట్, ప్లాన్స్  సర్ జి..!

లాభాలలో ఆపిల్ సంస్థ......!

Posted 19 days ago | Category : business

లాభాలలో ఆపిల్ సంస్థ......!

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

Posted 19 days ago | Category : business

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు !

ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

Posted 20 days ago | Category : business

 ఇన్ ఫోకస్ తో రిలయెన్స్ జియో : తక్కువ ధర !

సరికొత్త షార్ట్ థియేటర్..!

Posted 20 days ago | Category : business

సరికొత్త షార్ట్ థియేటర్..!