//single page style gallary page

తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయపార్టీల్లో నాట‌కీయ ప‌రిణామాలు.

Posted a year ago | Category : state politics

తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త‌ పార్టీల పొత్తుల‌పై నేత‌ల కామెంట్స్‌ ఆలోచ‌న‌లు స‌రికొత్త ఒర‌వ‌డికి శ్రీకారం చుడుతున్నాయా! పార్టీ నాయకులలో, కార్యకర్తలలో అనుమానాల‌ను బ‌ల‌ప‌రుస్తున్నాయి. ఎవ‌రు ఎవ‌రితో జ‌త‌క‌డ‌తారా ఎవ‌రిని ఏనేత నెత్తిన పెట్టుకుంటారో తెలియ‌ని అయోమ‌యం నెల‌కొంది. వీట‌న్నింటి టార్గెట్ 2019 ఎన్నిక‌ల్లో అధికార సాధ‌నే లక్ష్య‌మ‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. అయితే దీనిలో అపార అనుభ‌వం వున్న పార్టీ నేత‌లు, త‌ల‌పండిన రాజ‌కీయ కురువృద్ధులు కూడా ఉండ‌టం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇదంతా ప్ర‌జాసేవ కోసమా లేకుంటే అధికారం చేజారుతుంద‌నే భ‌య‌మా అనేది తేల్చ‌డం కూడా కొంచం క‌ష్ట‌మే సుమీ. కానీ లక్ష్యం మాత్రం గెలుపు మరియు ప్ర‌త్య‌ర్థి పార్టీను కోలుకోలేని విధంగా దెబ్బ‌తీయ‌ట‌మే అనేది అక్షరాలా సత్యం.

తెలంగాణ‌లో బీజేపీతో చెలిమి వ‌ద్దంటూ టీడీపీ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతుంది. దీనికి కాంగ్రెస్ కూడా బీజేపీ, టీఆర్ఎస్‌ల‌ను ఓడించేందుకు తాము ఎవ‌రితో అయినా స‌రే జ‌త‌క‌ట్టేందుకు రెడీ అంటూ సాక్షాత్తూ సీనియ‌ర్ నేత‌లే ప్ర‌క‌టించారు. అయితే దీని వెనుక మ‌రో మ‌త‌ల‌బు కూడా ఉంద‌నే వాద‌న వినిపిస్తుంది. కేసీఆర్ సీఎం కావ‌టంతో ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌క్రం తిప్పిన రెడ్డి సామాజిక‌వ‌ర్గం ప్రాభ‌ల్యం త‌గ్గింది. అందుకే పోయిన‌చోట‌నే రాబ‌ట్టుకోవాల‌నే ఉద్దేశంతో రేవంత్‌రెడ్డి సార‌థ్యంలో వున్న టీడీపీతో కాంగ్రెస్ నాయుకులు కలవాలి అనుకుంటున్నట్లు సమాచారం. బీజేపీలో బీసీల‌దే హ‌వా, హిందుత్వ ఎజెండాతో హిందువుల ఓట్ల‌ను చీల్చ‌టం ద్వారా ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు గండి కొట్ట‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో ముస్లిం రిజ‌ర్వేష‌న్ల‌తో మైనార్టీలో మంచి ప‌ట్టు సాధించిన టీఆర్ఎస్‌కు ప‌రోక్షంగా లాభం చేకూర్చ‌వ‌చ్చ‌నే ఉద్దేశం కూడా ఉంద‌నే అనుమానాలున్నాయి. ఇక వైసీపీ, వామ‌ప‌క్షాలు పెద్ద‌గా ప్ర‌భావం చూప‌వ‌నే చెప్పాలి.

టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ నాలుగు స్తంభాల మాత్ర‌మే జ‌రిగే ఎన్నిక‌ల హోరులో అధికార పార్టీను ఇరుకున పెట్టేందుకు మ‌హాకూట‌మిగా నిల‌బ‌డినా 2009నాటి ప‌రిస్థితులే రిపీట్ కావ‌చ్చ‌నే ఆందోళ‌న ఉంది. మ‌రి ఈ లెక్క‌న పొత్తులపై ఇప్పుడు నేత‌లు చెబుతున్న‌ మాట‌ల‌న్నీ కేవ‌లం వ్య‌క్తిగ‌త ఉద్దేశాలుగా మాత్ర‌మే ప‌రిగ‌ణించాలంటూ సీనియ‌ర్ నేత‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.ఏదిఏమైనా రాజకీయ నాయుకులు ఉసరవెల్లి లాంటివారు ఎప్పుడు ఎవరు ఎలా మారతారో ఎవరికీ తెలియదు....2019 ఎలెక్షన్స్ మాత్రం మంచి రసవత్తరముగా మారతాయని చెప్పవచ్చు.....చూద్దాం ఏ ఏ పార్టీలు కలుస్తాయో..ఎవరు గద్దె ఎక్కుతారో....ఎవరు గద్దె ఎక్కినా కోట్లు కోట్లు స్కామ్లు చెయ్యకుండా ప్రజలకు మంచి చేస్తే చాలు.


తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

Posted 14 minutes ago | Category : politics national

తిప్పరా మీసం.... చంద్రబాబు ని చూసి తెలుగోడా

ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

Posted 2 hours ago | Category : politics state

 ఐక్యరాజ్య సమితిలో బాబు మాట్లాడుతున్న రెండు అంశాలు ఇవే...

ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

Posted 2 hours ago | Category : politics state

 ట్రంప్ చూపు కూడా మన బాబు వైపే....!

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

Posted 3 hours ago | Category : politics national

మోడీ, అంబానీ వాటాల వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు..!

మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న అమృత ....!

Posted 4 hours ago | Category : national politics state

 మిర్యాలగూడ లో మారుతీరావు కోసం 2k రన్ .......షాక్ తిన్న  అమృత ....!

రాజ‌కీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ..!

Posted 4 hours ago | Category : politics movies

రాజ‌కీయాల్లోకి ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ..!

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

Posted 4 hours ago | Category : politics business

టైకూన్స్‌ ఆఫ్‌ టుమారో లో చోటు దక్కించుకున్న ఉపాసన , సింధు ......

ఎన్నిక‌ల ప్ర‌చారం చేయాలంటేనే.. భ‌య‌ప‌డుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి..!

Posted 4 hours ago | Category : state politics

ఎన్నిక‌ల ప్ర‌చారం చేయాలంటేనే.. భ‌య‌ప‌డుతున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి..!

గ్రూపులే గుదిబండ‌ల‌య్యాయి..!

Posted 5 hours ago | Category : politics state

గ్రూపులే గుదిబండ‌ల‌య్యాయి..!

రాహుల్ వేసిన స్కెచ్‌తో.. మోడీకి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి.!

Posted 5 hours ago | Category : politics national

రాహుల్ వేసిన స్కెచ్‌తో.. మోడీకి ప‌ట్ట‌ప‌గ‌లే చుక్క‌లు క‌న‌ప‌డ్డాయి.!

జగన్ ప్రజాసంకల్ప యాత్ర @ 3000 KM

Posted a day ago | Category : politics

 జగన్ ప్రజాసంకల్ప యాత్ర @ 3000 KM