//single page style gallary page

వాట్సప్ సర్వీస్ డౌన్

Posted 9 months ago | Category : world

ప్రపంచ వ్యాప్తంగా వాట్సప్ యూజర్లు ఉదయం నుంచి తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇటలీ, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, జర్మనీ, అమెరికా, శ్రీలంకతోపాటు భారత్‌లోనూ వాట్సప్ సర్వీస్ డౌన్ అయింది. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి వాట్సప్ సర్వీసులకు తీవ్రం అంతరాయం ఏర్పడింది. వేలాది మంది వాట్సప్ కస్టమర్లు తమ అసౌకర్యం గురించి వాట్సప్ యాజమాన్యానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదుల్లో 60 శాతం వాట్సప్ సర్వీస్ కనెక్టింగ్‌కు సంబంధించినవి కాగా.. 25శాతం మెసేజ్‌లు రిసీవ్ చేసుకోవడం గురించి, 14శాతం యాప్ లాగిన్‌కు సంబంధించిన ఫిర్యాదులని యాజమాన్యం తెలిపింది. అయితే ఈ సమస్య అందరు యూజర్లకు లేదనీ, కొంతమంది యూజర్లకు వాట్సప్ బాగానే కనెక్ట్ అవుతున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. కాగా తమకు వేలాదిగా వస్తున్న ఫిర్యాదులను వాట్సప్ టెక్నికల్ టీమ్ విశ్లేషిస్తోంది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఉదయం నుంచి ఈ అంశం గురించి సోషల్ మీడియాలోనూ, ట్విటర్‌లోనూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వాట్సప్ సర్వీస్ డౌన్ అయిందంటూ తమ మిత్రులకు సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఇలాంటి సమస్య వాట్సప్‌ నుంచి రావడం ఇదే మొదటిసారని చర్చించుకుంటున్నారు.  చాట్ కాంటాక్ట్స్ ఓపెన్ అవుతున్నా.. మెసేజ్‌లు రావడం, సెండ్ అవడం వంటి సర్వీసులు నిలిచిపోయాయి. ఉదయం నుంచి ‘కనెక్టింగ్’ అనే మెసేజ్‌ను మాత్రమే చూపిస్తోంది. డెస్క్‌టాప్‌కు వాట్సప్‌ను కనెక్ట్ చేసి సర్వీసులను వినియోగించడం కూడా కుదరడం లేదని నెటిజన్లు వాపోతున్నారు. ఫేస్‌బుక్‌లా యూజర్లు అంతా కనెక్ట్ అవడానికి సోషల్ మీడియా పేజ్ లేకపోవడంతో వాట్సప్ సర్వీసుల్లో కలుగుతున్న అంతరాయం గురించి యాజమాన్యానికి చెప్పేందుకు, లేక యాజమాన్యం ఏదైనా సమాచారాన్ని ఇచ్చేందుకు వీలులేకుండా పోయింది. వాట్సప్‌కు అధికారిక ట్విటర్ పేజీ ఉన్నా.. 2014 నుంచి దాంట్లో కొత్త పోస్టింగ్స్ ఏమీ లేవు. 


మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

Posted 4 days ago | Category : world

మిరకిల్ మిల్లి...గిన్నిస్ లో తెగలోల్లి...

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

Posted 5 days ago | Category : world

అమెరికాలో జరిగిన యదార్థ కథ...

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

Posted 6 days ago | Category : world

ఫిఫాలో విశ్వవిజేతగా..సత్తా చాటిన ఫ్రాన్స్...

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

Posted 8 days ago | Category : world technology

వాట్సాప్ వాడకంపై నిఘా పెట్టనున్న..సుప్రీంకోర్టు....

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

Posted 19 days ago | Category : world

కైలాస్ యాత్రకు వెళ్లిన తెలుగు యాత్రికులు క్షేమం

అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం...

Posted 19 days ago | Category : world

అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం...

బాబూ దయచూపు..!

Posted 20 days ago | Category : state politics world

బాబూ దయచూపు..!

అమ్మాయిలూ తాగకండి..

Posted a month ago | Category : health world

అమ్మాయిలూ తాగకండి..

అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

Posted a month ago | Category : world business

అక్కడ బంగారం కొంటారా...? అదిరిపోయే ఆఫర్

వాజ్ పేయి కి తీవ్ర అస్వస్థత

Posted a month ago | Category : world national

వాజ్ పేయి కి తీవ్ర అస్వస్థత

వెళ్తున్న విమానంలోనే సెక్స్...ఛి

Posted a month ago | Category : world

వెళ్తున్న విమానంలోనే సెక్స్...ఛి