గూగుల్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల్లో తీవ్రవాద సమాచారంపై పోరు

Posted 9 months ago | Category : world politics

తీవ్రవాదులు ఇంటర్‌నెట్‌ను దుర్వినియోగం చేస్తున్నారని దాన్ని అంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇటలీ లోని  టోర్మినాలో జరిగిన జి7 సదస్సు నేతలు ప్రతిన చేశారు. గూగుల్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల్లో హానికరమైన తీవ్రవాద సమాచారాన్ని తొలగించాలని ఈ సందర్భంగా బ్రిటన్‌ ప్రధాని థెరిస్సా మే సాంకేతిక సంస్థలకు స్ఫష్టం చేశారు. 

తీవ్రవాదాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటామని జి7 పారిశ్రామిక దేశాల నేతలు స్పష్టం చేశారు. మాంచెస్టర్‌ దాడి నేపథ్యంలో జరిగిన జి7 సదస్సులో అంతర్జాతీయ సమాజానికి తీవ్రవాదం విసురుతున్న సవాళ్ళను ఐక్యంగా ఎదుర్కొనాలని జి7నేతలు నిర్ణయించారు. 

హింసతో కూడిన తీవ్రవాదంపై పోరు సాగించడమే ప్రస్తుతం జి 7 దేశాల ప్రధాన ప్రాధాన్యతగా వుందని సదస్సు ప్రకటనలో పేర్కొన్నారు. తీవ్రవాద చర్యలను నివారించేందుకు అవిశ్రాంతంగా కృషి చేయడం, తీవ్రవాదానికి పాల్పడిన కుట్రదారులను, మద్దతుదారులను విచారించడం ద్వారా ఈ పోరాటాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని పిలుపిచ్చారు. 

ఐసిస్‌లో చేరేందుకు సిరియా, ఇరాక్‌లకు ప్రయాణిస్తున్న వారిని పట్టుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలని, ఇందుకు గానూ దేశాల మధ్య ఇంటెలిజెన్స్‌ సమాచార మార్పిడి, సాక్ష్యాధారాలను పంచుకోవడం బాగా మెరుగుపడాలని, పోలీసు, న్యాయ విచారణా క్రమాలు కూడా పటిష్టపడాలని బ్రిటన్‌ కోరింది. తీవ్రవాదులకు అందుతున్న నిధులు, వనరుల మూలాలను కనుగొని వాటిని అంతమొందించేందుకు చర్యలు తీసుకోవాలని నేతలు నిర్ణయించారు. 

ఇందుకుగానూ ప్రయాణికుల పరిశీలనా సమయంలో పాసింజర్ నేమ్‌ రికార్డ్‌ (పిఎన్‌ఆర్‌), అడ్వాన్స్‌ పాసింజర్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎపిఐ)ల వినియోగాన్ని మరింతగా పెంచాలని డిక్లరేషన్‌ పేర్కొంది.సామాజిక, ఆర్థిక అసమానతలు పెరిగిపోవడం, అవకాశాలు కొరవడడం వంటివి కూడా తీవ్రవాదం పెచ్చరిల్లడానికి దోహదపడుతున్నాయని, హింసకు దారి తీస్తున్నాయని డిక్లరేషన్‌ పేర్కొంది.


రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 3 hours ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 18 hours ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 20 hours ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 20 hours ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 20 hours ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted a day ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

నన్ను భయపెట్టడానికి దయ్యాల్ని పంపారు.. నేను వెళ్ళిపోతా..!

Posted a day ago | Category : politics

నన్ను భయపెట్టడానికి దయ్యాల్ని పంపారు.. నేను వెళ్ళిపోతా..!

ఏపీకి నిధులు రావాలంటే ఏమి చేయాలో చెప్పిన కొడాలి నాని

Posted a day ago | Category : politics

ఏపీకి నిధులు రావాలంటే ఏమి చేయాలో చెప్పిన కొడాలి నాని

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!

Posted a day ago | Category : politics

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!