//single page style gallary page

ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి హింస

Posted 10 months ago | Category : politics

కేరళలో రాజకీయ హత్యలు భయానక వాతావరణం కల్పిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి హింసాత్మక సంఘటనలు జరుగుతూన్నాయని  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అధికార సీపీఎం శ్రేణులు హింసాత్మక వాతావరణం సృష్టించి ప్రత్యర్థులను తుదముట్టించేందుకు పూనుకున్నాయని ఆరోపించారు.

గత నెల 29న తిరువనంతపురంలో హత్యకు గురైన ఆరెస్సెస్ కార్యకర్త రాజేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కేరళలో ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చిన ప్రతీసారి హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. అంతకుముందు రాజేశ్ సంస్మరణ సభలో జైట్లీ మాట్లాడుతూ సీపీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు చెప్పారు.

ఆరెస్సెస్ బీజేపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు జరుగుతున్నా కేరళ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించినందున రాష్ట్రపతి పాలన విధించాలని కోరతారా? అన్న ప్రశ్నకు జైట్లీ సమాధానం దాటేశారు. ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి  పినరాయి విజయన్ అఖిలపక్ష సమావేశం నిర్వహించడం సానుకూల పరిణామం అని చెప్పారు.

కాగా, అఖిలపక్ష భేటీ తర్వాత పినరాయి విజయన్ మీడియాతో మాట్లాడుతూ తమ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని జైట్లీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. హింసాత్మక ఘటనలను నియంత్రించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు.

రాష్ట్రంలో రాజకీయహింస జరుగుతున్నదన్న ప్రచారం జరిగితే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేవారు. ఇటీవల ఆరెస్సెస్ బీజేపీ కలిసి 21 మంది తమ కార్యకర్తలను హత్య చేశాయని, వారి కుటుంబ సభ్యులను కూడామంత్రి జైట్లీ పరామర్శించాలని డిమాండ్ చేస్తూ రాజ్‌భవన్ ముందు సీపీఎం సత్యాగ్రహం నిర్వహించింది.


మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

Posted 19 hours ago | Category : sports politics

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

టీడీపీలోకి కీల‌క నేత‌..!!

Posted 20 hours ago | Category : politics

 టీడీపీలోకి కీల‌క నేత‌..!!

రంగంలోకి కుమారస్వామి భార్య

Posted 21 hours ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

Posted a day ago | Category : politics

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

Posted a day ago | Category : politics

 ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

Posted a day ago | Category : politics

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

Posted a day ago | Category : politics movies

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

Posted a day ago | Category : politics

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

Posted 2 days ago | Category : politics

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

Posted 2 days ago | Category : politics national

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

జగన్ పార్టీకి షాక్

Posted 2 days ago | Category : state politics

జగన్ పార్టీకి షాక్