ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

విజయవాడ మెట్రో రైల్ కు మంగళం!

Posted 6 months ago state politics

నవ్యంధ్ర రాజధాని అమరావతి చుట్టూ ఏర్పాటు చేయదలచిన ప్రతిష్టాకరమైన విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం మంగళం పాడిన్నట్లు తెలుస్తున్నది. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చుకు, వచ్చే రాబడికీ పొంతన లేకపోవడంతో పాటు భవిష్యత్‌లో నిర్వహణ భారమవుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

ఈ క్రమంలోనే ప్రాజెక్టు పనులను పర్యవేక్షి స్తున్న అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్‌ (ఎఎంఆర్‌సి)కు మున్సిపల్‌ మంత్రిత్వశాఖ ప్రత్యామ్నాయాలను పరిశీలించాల్సిందిగా సూచించింది, మహాత్మాగాంధీ, కారల్‌మార్క్స్‌ మెట్రో కారిడార్‌ ప్రతిపాదిత రహదారులపైనే మరో రహదారిని ఏర్పాటు చేసి చైనా జుజాంగ్‌ పట్టణంలో ఉన్న తరహాలో ట్రాక్‌, డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌లు, అమృత్‌సర్‌లో ఉన్న బిఆర్‌టిఎస్‌ తరహా ప్రాజెక్టు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను తాజాగా పరిశీలిస్తున్నారు.  

ప్రాథమికంగా ఎలివేటెడ్‌ ట్రాక్‌, డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌, ఎలక్ట్రికల్‌ బస్‌లకు సంబంధించిన ప్రాజెక్టులను ప్రభుత్వం ముందు ఉంచేందుకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌లను సిద్ధం చేస్తోంది. మెట్రో ప్రత్యామ్నాయ ప్రాజెక్టు వ్యయం కిలో మీటరుకు రూ.70 కోట్ల నుంచి రూ.75 కోట్లు, మెట్రో ప్రాజెక్టుకు కిలో మీటరుకు రూ.250 కోట్ల వరకు వ్యయమవడంతోపాటు భవిష్యత్‌లో నిర్వహణ భారంగా మారుతుందని ప్రభుత్వం పునరాలో చనలో పడింది.

ఈ ప్రాజెక్టుకు 78 ఎకరాల వరకు విలువైన భూములు సేకరించాల్సి ఉండగా తాజా ప్రాజెక్టు కు కేవలం 10 ఎకరాల భూములు సేకరిస్తే సరిపోతుందని తెలుస్తోంది.మున్సిపల్‌ శాఖ మంత్రిత్వ శాఖ సూచన మేరకు మెట్రో ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం ముందు ఉంచేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. ప్రాజెక్టు వ్యయం తక్కువగా, కాలుష్య రహితంగా ఉండే ప్రాజెక్టులు పరిశీలిస్తున్నారు. అయితే మెట్రో ప్రాజెక్టు రద్దయినట్లు మాత్రం ప్రభుత్వం చెప్పడం లేదు. .

Related Articles

Most Read