నంద్యాలలో పోటీ పట్ల విజయమ్మ విముఖత ?

Posted 8 months ago | Category : state politics


భూమా నాగిరెడ్డి మృతితో ఉపఎన్నిక జరుగనున్న నంద్యాలలో  వైకాపా పోటీ చేయడం పట్ల ఆ పార్టీ  గౌరవాధ్యక్షురాలు, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి   అమ్మగారు వై యస్ విజయమ్మ విముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది. భూమా నాగిరెడ్డి కి తమ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యానే కాకుండా, గతంలో రెండు, మూడు ఉపఎన్నికలు పోటీ లేకుండా జరగడం కూడా అందుకు కారణంగా చూపుతున్నారు. 

నాగిరెడ్డి చనిపోయిన సందర్భంగా అంత్యక్రియలు కూడా పూర్తి కాకుండానే అక్కడ తమ పార్టీ అభ్యర్థిని నిలబెడుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం పట్ల ఆయన పార్టీకి చెందిన పలువురు నాయకులతో పాటు విజయమ్మ సహితం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తున్నది. సానుభూతితో టిడిపి గెలుపొందితే తమ పార్టీ ప్రతిష్ట పోగొట్టుకో వలసి వస్తుందని కూడా భావిస్తున్నారు. 

పైగా బలమైన అభ్యర్ధిని ఎంపిక చేయలేక పోతున్నారు. గత నెలలోనే అభ్యర్థిని ప్రకటించాలని జగన్మోహన్ రెడ్డి భావించినా ముందుగా టిడిపిని ప్రకటించ నీయండి అన్నట్లు ఉన్నారు. అభ్యర్థి ప్రకటన తరువాత టిడిపిలో అసంతృప్తి చెందిన వారు తమ వైపు వస్తే అని ఎదురు చూస్తున్నట్లు కూడా వినికిడి. 

మరోవంక విజయమ్మ అభిప్రాయం తెలుసుకున్న ఏపీ టూరిజం మంత్రి భూమా అఖిలప్రియ ఎన్నిక కావడానికి సహకరించాలని కోరుతూ విజయమ్మను కలిసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక సమాచారం లేనప్పటికీ, తన తల్లిదండ్రులతో వైఎస్ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రస్తావించిన ఆమె, బ్రహ్మానందరెడ్డికి ఓ చాన్స్ ఇవ్వాలని విజయమ్మను అభ్యర్థించినట్టు సమాచారం.

 అభ్యర్థిత్వం విషయంలో రెండు పార్టీలలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఇప్పటికే, వైకాపా తరఫున తాను బరిలో ఉంటానని గంగుల ప్రతాపరెడ్డి చెప్పుకోగా, ఇటీవలి నంద్యాల వైకాపా ప్లీనరీలో కర్నూలు జిల్లా నేతలు నియోజకవర్గ ఇన్ చార్జ్ రాజగోపాల్ రెడ్డి పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 

మరోవైపు తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం కూడా నంద్యాల బరిలో ఎవరుంటారన్న విషయమై ఎటువంటి ప్రకటనా చేయలేదు. సీటు తమ కుటుంబానిదే కాబట్టి తమకు అవకాశం ఇవ్వాలని భూమా కుటుంబం అంటుండగా, పార్టీలో అనాదిగా ఉంటున్న తనకు అవకాశం ఇవ్వాలని శిల్పా పట్టుబడుతుండటంతో ఇక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.


వీడియో కాల్ తో సూసైడ్ చేసుకున్న యువతీ..!

Posted 4 hours ago | Category : state

వీడియో కాల్ తో సూసైడ్ చేసుకున్న యువతీ..!

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

విశాఖలో దారుణం...హత్యకు గురైన వి ఆర్ ఐ......!

Posted 6 hours ago | Category : state

విశాఖలో దారుణం...హత్యకు గురైన వి ఆర్ ఐ......!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన..!

Posted 10 hours ago | Category : state

సికింద్రాబాద్‌లో నిర్భయ తరహా ఘటన..!

ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు..!

Posted 11 hours ago | Category : state

ఒంటిమిట్ట చెరువులో మృతదేహాలు..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

మద్యం మత్తులో హిజ్రా ఎంచేసిందో తెలుసా...!

Posted 14 hours ago | Category : state

మద్యం మత్తులో హిజ్రా ఎంచేసిందో తెలుసా...!

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

Posted 15 hours ago | Category : state

కేపీహెచ్‌బీ చట్నీస్‌ హోటల్‌లో అగ్నిప్రమాదం..!

నేడు ఆమ్రపాలి వివాహం..!

Posted 16 hours ago | Category : state

నేడు ఆమ్రపాలి వివాహం..!

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!

Posted a day ago | Category : state

బాలుడి కోరిక తీర్చిన కెసిఆర్........!