ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

9 వేలకోట్ల రుణాలు తిన్నవిజయ్ మాల్యా "అరెస్ట్ "

Posted 7 months ago world

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా సహా పలు బ్యాంకులకు రు.9 వేలకోట్ల రుణాలు ఎగవేసిన, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను లండన్ లో అరెస్ట్ చేశారు,బ్యాంకుల దగ్గర నుండి తీసుకున్న రుణాల ఎగవేసిన కేసులో మాల్యాను నిందితుడిగా అరెస్ట్ చేశారు. భారత్ నుంచి పారిపోయిన మాల్యా ప్రస్తుతం ఇంగ్లాండ్ రాజధాని లండన్ కు సమీపంలో గల ఓ మారుమూల గ్రామంలో తలదాచుకుంటున్నాడు. మాల్యాను అదుపులోకి తీసుకున్న యూకే పోలీసులు కాసేపట్లో వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు, మాల్యాను త్వరలోనే భారత్ కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం వుంది.

బ్యాంకుల వద్ద నుండి రు.9 వేలకోట్లు రుణాలు ఎగవేసిన విజయ్ మాల్యా 2016 మార్చి 2 న లండన్ పారిపోయిన విషయం తెలిసిందే, అప్పటి నుంచి ఆయన్ను భారత్ కు తీసుకోచ్చేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. మాల్యా వీసాను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అప్పట్లో మాల్యాను బలవంతంగా ఆ దేశం నుండి పంపేయాలని భారత విదేశాంగ శాఖ యూకే ప్రభుత్వాన్ని కోరింది. అయితే అది సాధ్యం కాదని అప్పట్లో యూకే ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు మాల్యాను విచారించేందుకూ ఎన్ ఫోర్స్ మెంట్ రంగం సిద్ధం చేసింది. విచారణకు రావాలని అనేక నోటీసులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాను భారత్ కు రాలేనని మాల్యా అప్పట్లో ట్విట్టర్ ద్వారా స్పందించారు. అయితే రుణాల విషయంలో బ్యాంకులతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని మాల్యా తెలిపాడు. ఇది ఇలా ఉండగా మాల్యాకు వ్యతిరేకంగా బ్యాంకులు కన్సార్టియం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మాల్యా తన పూర్తి ఆస్తుల వివరాలను వెల్లడించాలని పిటిషన్ వేసింది, అయితే పిటిషన్ కు మాల్యా స్పందించకపోవడంతో ఇటీవలే ఢిల్లీ హైకోర్ట్ ఆయనపై ఓపెన్ ఎండెడ్ నాన్ బేయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎట్టకేలకు 9 కోట్ల రుణాలు మింగేసిన మాల్యాను యూకే పోలీసులు అరెస్ట్ చేసారు.

మాల్యా రుణాలు చెలించాల్సిన బ్యాంకుల లిస్ట్ :-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : రూ. 1600 కోట్లు

పంజాబ్ నేషనల్ బ్యాంక్ : రూ. 800 కోట్లు

ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అండ్ రీసెర్చరల్ బ్యాంక్ : రూ. 800 కోట్లు

బ్యాంక్ ఆఫ్ ఇండియా : రూ. 650 కోట్లు

బ్యాంక్ ఆఫ్ బరోడా : రూ. 550 కోట్లు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : రూ. 430 కోట్లు

UCO బ్యాంక్ : రూ. 320 కోట్లు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : రూ. 410 కోట్లు

కో-ఆపరేటివ్ బ్యాంక్ : రూ. 310 కోట్లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ : రూ. 150 కోట్లు

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ : రూ. 140 కోట్లు

ఫెడరల్ బ్యాంక్ : రూ.90 కోట్లు

పంజాబ్ నేషనల్ అండ్ సింధ్ బ్యాంక్ : రూ. 60 కోట్లు

యాక్సిస్ బ్యాంక్ : రూ. 50 కోట్లు

Most Read