ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు !

Posted 5 months ago politics

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున వెంకయ్యనాయుడు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తున్నది. సోమవారం సాయంత్రం జరుగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. బీజేపీ సీనియర్ నేత, పార్లమెంటేరియన్‌గా సుదీర్ఘ అనుభవం, రాజ్యసభను నిర్వహించడంలో సామర్థ్యం, వాగ్ధాటి.. ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం పార్టీ అధిష్ఠానం వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. 

మంగళవారం నామినేషన్లు దాఖలు చేయడానికి తుది గడువు కాబట్టి సోమవారం సాయంత్రంకల్లా ఎన్డీయే తమ అభ్యర్థి పేరును ప్రకటించాల్సి ఉంది.  అయితే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయం జరుగకుండానే వెంకయ్యనాయుడి పేరు తెరపైకి రావడం సంచలనం రేకెత్తించింది. ఈ వార్తల అనంతరం వెంకయ్యనాయుడి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అధికారిక ప్రకటన వెలువడకముందే ఊహాగానాల మేరకు చర్చించడం సమంజసం కాదని మీడియాకు సూచించింది. 

మూడు రోజుల క్రితం తమతో సమావేశమైన అమిత్‌షాకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా దక్షిణాది వ్యక్తికి అవకాశం ఇవ్వాలని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు సూచించారు. కాగా, యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Related Articles

Most Read