ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

కన్నీళ్లు పెట్టుకున్నవంశీ, రాజీనామా ! : అసలేమైంది ?

Posted 20 days ago politics

అమరావతి అసెంబ్లీ లాబీ లో గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా వార్త కలకలం సృష్టించింది.

డెల్టా సుగర్స్ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయం తన పట్ల అమర్యాదగా ప్రవర్తించిందని ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. డెల్టా షుగర్స్ ని తణుకు తరలించాలన్న ప్రతిపాదనను ఆయన వ్యతిరేకిస్తున్నారు. దీని వల్ల రైతులు ఇబ్బంది పడతాడరని ఆ ప్రయత్నం విరమించుకోవాలని చెప్పేందుకు ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చారు. అయితే, అక్కడ అధికారులు దురుసుగా ప్రవర్తించడంతో ఆయన మనస్థాపం చెందారు.

అందరి ఎదుటే కన్నీటి పర్యంతమయ్యారు. ఒక ఎమ్మెల్యే ఇలా చేయడం అక్కడ సంచలనం సృష్టించింది. తాను రాజీనామా చేసేందుకు సిద్దమయ్యానని లేఖ కూడా చూపించారు. దానిని స్పీకర్ కుసమర్పించేందుకు కూడా ప్రయత్నించారు. అయితే, వంశీ రాజీనామా లేఖ లేఖను బోడె ప్రసాద్ చింపేశారు.

ఆయనకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించారు. ఈవిషయం వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దృష్టి కి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే వంశీకి నచ్చ చప్పేందుకుమంత్రి కళా వెంకటరావు ని పంపారు. చివరకు కళావెంకట్రావు బుజ్జగింపులతో రాజీనామాపై వల్లభనేని వంశీ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. వంశీ పట్ల సిఎంఒ అధికారులు ఎందుకు దురుసుగా ప్రవర్నించారనేది ఇపుడు సర్వత్రా చర్చనీయాంశమయింది.

Related Articles

Most Read