రక్తం తాగే వింత ప్రేమజంట.

Posted 8 months ago | Category : world

అప్పుడప్పుడు వాళ్లు రక్తం జలగలా పీల్చేస్తారు... రక్తం తాగేస్తారు అంటుంటాం. కానీ అది నిజంగా తాగడం కాదు.. సమస్య తీవ్రతను చెప్పేందుకు.కానీ ఇదో రివర్స్ సంఘటన ప్రేమికుల జంట ఒకటి.. నిజంగానే రక్తం తాగుతోంది. అదేంటని అడిగితే ‘మేం ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఒకరి రక్తం మరొకరు తాగుతాం’ అని చెబుతోందీ జంట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నాఇది నిజం. ఇటలీకి డేనిల్ అల్బర్ట్ సర్కస్ నిర్వహిస్తుంటాడు. అతనికి సాయం అందించేందుకు మూడేళ్ల క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఇలారియ అనే అమ్మాయిని నియమించుకున్నాడు. కాలక్రమంలో వీళ్ళిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ ఎంత ఘాటైనదంటే ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత మాత్రమే కాదు ఒకరి రక్తం మరొకరు తాగేంత దృఢమైనది వీరి బంధం.

‘పురాణాల ప్రకారం రక్తం అనేది శరీరపు జ్యూస్, దీని అర్థం ఇదే ప్రాణం మనకు. మా ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి ఒకరి రక్తం మరొకరం తాగుతాం. ఇది మా బంధాన్ని తెలియజేస్తుంది’ అని డేనిస్ చెబుతున్నాడు.ప్రస్తుతం ఈ జంట జర్మనీలో సర్కస్ షోలు నిర్వహిస్తోంది. అంతేకాదు. నిజ జీవితానికి దగ్గరగా ఈ జంట సర్కస్ షోలలో జీవుల రక్తం పీల్చే ‘వాంపైర్’ షోలు కూడా చేస్తూ ఉంటుంది. ఇందుకోసం ఈ జంట ప్రత్యేక దంతాలు కూడా అమర్చుకుంది.

సిరంజీల ద్వారా రక్తాన్ని తోడేసి తాగుతోంది ఈ జంట. ఇలారియా డేనిస్ కంటే అధిక రక్తం తాగుతుంది. తాను ఎక్కువ రక్తం పీల్చితే ప్రేయసి అందం చెడిపోతుందేమోనని ఆందోళనతో తక్కువే తాగుతానని డేనిస్ చెబుతున్నాడు.అయితే వేసవిలో బయటికి లాగేసిన రక్తం త్వరగా గడ్డ కడుతోందని.. ఇది చాలా ఇబ్బందిగా మారిందని ఈ జంట ఆవేదన వ్యక్తం చేస్తోంది. కృత్రిమ దంతాలు ఉన్నందున ఆపిల్ వంటి పండ్లు కూడా తినొద్దని వైద్యులు చెప్పారని అంటోంది.వీళ్ల ప్రేమ సంగతి ఏమోకానీ..వింతలందు...ఈ వింత మనుషులు వేరయా....అలాగే వీళ్ల ‘రక్త సంబంధం’ గురించి చదువుతుంటే.. ఒళ్లు గగుర్పాటుకు గురవుతోంది కదా!


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 14 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted 20 hours ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!