ఎవరెస్టుపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

Posted 2 months ago | Category : world

వివిధ సాహస కృత్యాలతో విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్యన్ సాహసికుడు ప్రమాదవశాత్తూ హిమాలయాలపై ప్రాణాలు కోల్పోయాడు.

వివరాల్లోకి వెళ్తే... బేస్ జంపర్ వలెరి రొజోవ్ (52) నేపాల్‌ లోని హిమాలయాల్లో 6,812 మీటర్ల ఎత్తున్న అమ డాబ్లం పర్వత శ్రేణిపైనుంచి కిందికి దూకాడు. మామూలుగా బేస్ జంప్ లో వింగ్ సూట్ వేసుకుని ఎత్తయిన పర్వతం లేదా కొండ పైనుంచి దూకుతారు. గాలివాటాన్ని వినియోగించుకుని దిశమార్చుకుంటూ పర్వతాల దగ్గరగా వెళ్తూ తమను తాము రక్షించుకుంటూ కిందికి దిగుతారీ బేస్‌ జంపర్లు.

ఇలాంటి సాహసాలు చేసే వలెరి రొజోవ్‌ పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. 2013లో 7220 మీటర్ల ఎత్తున్న పర్వతం పైనుంచి బేస్‌ జంప్‌ చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. అనంతరం 2016లో మరోసారి 7700 మీటర్ల ఎత్తైన పర్వతం నుంచి బేస్‌ జంప్‌ చేసి తన రికార్డును తానే తిరగరాశాడు.

అయితే గత రికార్డు ఎత్తుకంటే తక్కువ ఎత్తున్న అమ డాబ్లం పర్వతంపైనుంచి కిందికి దూకుతూ ప్రాణాలు కోల్పోయాడు. కాగా, అతని మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. ఆయన మృతదేహం కోసం గాలిస్తున్నారు.


దావోస్ లో అపురూప దృశ్యాలు

Posted 16 hours ago | Category : world

దావోస్ లో అపురూప దృశ్యాలు

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

Posted a day ago | Category : world

కొత్త ప్రియుడితో ఒబామా కూతురు హల్చల్, ఎవరంటే ?

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

Posted 2 days ago | Category : world

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్ !

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

Posted 3 days ago | Category : world

మూతబడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ..!

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

Posted 3 days ago | Category : world

మమ్మల్నే బెదిరిస్తారా... గెట్ రెడీ ఫర్ వార్..!

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

Posted 3 days ago | Category : world

చంద్రబాబు దావోస్ యాత్ర షెడ్యూల్ ఇదే

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

Posted 7 days ago | Category : world sports

మైదానం లో కుప్ప కూలిన పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్

దేశంలో మనమే నెం.1 !

Posted 8 days ago | Category : world

దేశంలో మనమే నెం.1 !

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

Posted 11 days ago | Category : world

మేము సైతం అంటున్న ఎయిర్ లైన్స్

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

Posted 13 days ago | Category : world

కూతురితో కలిసి యాంకర్‌ ఎందుకు వార్తలు చదివింది అంటే ?

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!

Posted 13 days ago | Category : world

కుప్పకూలుతున్న చైనా మొబైల్ మార్కెట్..!