మలేసియాలో వైగోకు అనుమతి నిరాకరణ

Posted 8 months ago | Category : world

శ్రీలంక తమిళ్ హక్కుల ఉద్యమకారుడిగా పేరొందిన తమిళ్ నాడు కు చెందిన ఎండీఎంకే అధ్యక్షుడు వైగోకు మలేసియాలో కాలు పెట్టడానికి అనుమతి నిరాకరించారు. దానితో  విమానాశ్రయం నుండే వెనుదిరగ వలసి వస్తున్నది.  గత వారమే చెన్నై లోని మలేసియా రాయబార కార్యాలయం ఆయనకు వీసా ఇచ్చినా, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈళం (ఎల్‌టీటీఈ)తో ఆయనకు సంబంధాలున్నాయన్న అనుమానాలపై ఆయనను కౌలాలంపూర్ విమానాశ్రయం వద్దే అధికారులు అడ్డుకుని, పలు గంటల పాటు ప్రశ్నించారు. ఉదయం 6.30 గంటల సమయంలో తన కార్యదర్శి అరుణగిరి తో కలసి విమానాశ్రయానికి చేరుకున్నారు. 

ఈనెల 10 సాయంత్రం జరుగనున్న తన కుమార్తె వివాహానికి హాజరుకావాల్సిందిగా మలేసియా లోని పెనాంగ్స్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  రామసామి పళనిసామి ఆహ్వానం మేరకు వైగో మలేసియా వెళ్లారు. 2009లో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్‌టీటీఈని శ్రీలంక సైన్యం తీవ్రస్థాయిలో అణిచివేసిన నేపథ్యంలో ఎల్‌టీటీఈకి అనుకూలంగా వైగో ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలున్నాయి. 

2009 నాటి రాజద్రోహం కేసు క్రింద తమిళ నాడు లో ఈ మధ్య అరెస్ట్ అయి గత నెలలోనే బెయిల్ పై ఆయన  విడుదల అయ్యారు. తనపై ఎటువంటి కేసులు శ్రీ లంకలో పెండింగ్ లో లేవని తన పాస్ పోర్ట్ ను చుపించినా మలేసియా అధికారులు విశ్వసించ లేదు.

తగు సంఖ్యలో తమిళ్ ప్రజలు ఉన్న తమ దేశంలో  ప్రమాదకర వ్యక్తుల జాబితాలో వైగో పేరు చోటుచేసుకుని ఉన్నట్లు మలేసియా అధికారులు తెలిపారు.  దీంతో వైగో శుక్రవారం రాత్రి 10-45 గంటల విమానంలో  చెన్నైకి బయలుదేరనున్నారు. శ్రీలంకలో స్వతంత్ర ప్రతిపత్తి కోసం మిలిటెంట్ పంథాను ఎంచుకున్న ఎల్‌టీటీఈపై ఇండియాలోనూ నిషేధం అమల్లో ఉంది.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!