//single page style gallary page

రాష్ట్రపతి తొలి ప్రసంగంపై రాజ్యసభలో రభస

Posted a year ago | Category : politics

రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రామనాధ్ కోవింద్ చేసిన తొలి ప్రసంగంపై కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభలో రభస సృష్టించారు. మొదటి ప్రసంగంలో తొలి భారత ప్రధాని పండిట్ నెహ్రు పేరును ప్రస్తావించకుండా అవమాన పరిచారని అంటూ కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ తీవ్ర వాఖ్యలు చేశారు.

జాతి నిర్మాత మ‌హాత్మాగాంధీతో బీజేపీ నేత దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ‌ను పోల్చ‌డం పట్ల తీవ్ర  ఆక్షేపణ వ్యక్తం చేశారు. "దీన్ ద‌యాళ్ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు కాదు.  ఆయ‌నకు జాతి నిర్మాణంలో భాగ‌స్వామ్యం లేదు. గాంధీతో దీన్‌ద‌యాళ్‌ను పోల్చ‌లేము", అని ఆనంద్ శ‌ర్మ విమ‌ర్శించారు. మోదీ ప్ర‌భుత్వం ద‌యాళ్ పేరును త‌మ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వాడుకుంటున్న‌ద‌ని, దీన్ని తాము వ్య‌తిరేకిస్తున్నామని ఆయన స్ఫష్టం చేశారు.

రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ త‌న ప్ర‌సంగంలో ఎందుకు నెహ్రా, ఇందిరా గాంధీ పేర్ల‌ను ప్ర‌స్తావించ‌లేదు అని ఆనంద్ శ‌ర్మ ప్ర‌శ్నించారు. నెహ్రూ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు అని, ఆయ‌నే దేశ తొలి ప్ర‌ధాని అని, ఆయ‌న పేరును ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం అవ‌మానించ‌డ‌మే అని కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు.

 ఇదే స‌మ‌యంలో గులామ్ న‌బీ ఆజాద్ చేసిన వ్యాఖ్య‌లు స‌భ‌లో దుమారం లేపాయి. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగాన్ని ఖండించిన కాంగ్రెస్ తీరుపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయం చేస్తోంద‌ని విమర్శించారు.

ఆనంద్ శ‌ర్మ ప్ర‌సంగాన్ని స‌భ రికార్డుల నుంచి తొలిగించాల‌ని జైట్లీ డిమాండ్ చేశారు. పాయింట్ ఆఫ్ ఆర్డ‌ర్‌లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగంపై ఓ స‌భ్యుడు ఎలా ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతార‌ని జైట్లీ ఆగ్ర‌హించారు. టీవీ కెమెరాల కోసం కాంగ్రెస్ ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ద‌ని జైటీ విమర్శించారు.


నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

Posted 19 hours ago | Category : politics

నాలుగేళ్ళలో రేవంత్ రెడ్డి పై కేసులు .. ఎన్నో తెలిస్తే షాక్

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

Posted 21 hours ago | Category : politics

దమ్ములు, ధైర్యాలు, ఏమి భాష రా స్వామీ ...పవన్ పై మరోసారి రెచ్చిపోయిన కత్తిమహేష్ ....!

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతల హెచ్చరిక

Posted a day ago | Category : politics

సుహాసినికి నిరసన సెగ ... నాన్ లోకల్ కి ఇవ్వొద్దని  కాంగ్రెస్ నేతల హెచ్చరిక

ఖమ్మంలో నయా రాజకీయం... దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

Posted a day ago | Category : politics

ఖమ్మంలో నయా రాజకీయం...  దోస్తానాతో దూసుకుపోతున్న కూటమి

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13 మందికే చోటు

Posted a day ago | Category : politics

మూడో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్....13  మందికే చోటు

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

Posted a day ago | Category : politics

వేణుమాధవ్ కు షాక్ ...నామినేషన్ చెల్లదని చెప్పిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి.. ప్రతి సవాల్ విసిరి సంచలనం

Posted a day ago | Category : politics

కేటీఆర్ సవాల్ కు రెడీ అన్న కోమటిరెడ్డి..  ప్రతి సవాల్ విసిరి సంచలనం

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ ప్రచారం లో ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ..చీరల్లోనే కోట్లు నొక్కేశారని కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

Posted a day ago | Category : politics

రేవంత్ రాష్ట్రంలో బిజీ... రేవంత్ సోదరులు అక్కడ బిజీ

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

Posted a day ago | Category : politics

టీజేఎస్ టికెట్ విషయంలో జానారెడ్డి మెలిక .. దేని కోసం

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్

Posted a day ago | Category : politics

కాంగ్రెస్ కు షాక్.. మంచిర్యాల కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి జంప్