కుటుంభం రాజకీయాల నుండి కోలుకుంటున్నయూపీ

Posted 8 months ago | Category : politics


ఏళ్ల తరబడి ఉత్తర ప్రదేశ్  ఒకే కుటుంబానికి చెందిన రాజకీయాల్లో చిక్కుకుపోయిందని, ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ చెప్పారు.  ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి వంద రోజలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అన్ని వర్గాల వారి కోసం పనిచేస్తోందని, ఎలాంటి వివక్ష చూపించడం లేదని సంతోషం వ్యక్తం  చేశారు. వంద రోజుల పాలన పనితీరుపై తాము సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.

ఈ ఏడాది జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి  జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న యూపీలో భాజపా 325 స్థానాల్లో గెలుపొంది జయభేరీ మోగించింది. మార్చి 18న యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

రైతుల శ్రేయస్సే తమ ప్రభుత్వం లక్ష్యం అంటూ వారిని ఆదుకోడానికే వారి ఉత్పత్తులను 5 రెట్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాలకు 24 గంటల పాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరామని పేర్కొన్నారు. యాంటీ రోమియో స్క్వాడ్‌లు ఎంతో బాగా పనిచేస్తున్నాయని అంటూ  వీటి వల్ల మహిళలు సురక్షితంగా ఉంటున్నారు. యూపీని మాఫియా లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అంటూ ఏటా జనవరి 24న ఉత్తరప్రదేశ్‌ డే నిర్వహిస్తామని చెప్పారు. 

కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు దత్తత తీసుకోవాలని యోగి ఆదిత్యనాథ్‌ పిలుపునిచ్చారు. పలు నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు దెబ్బతిన్నాయని, దీంతోస్థానికంగా ఉన్న చిన్నారులు చదువుకు దూరం అవుతున్నారని యోగి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలలను పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో ఒక్కో పాఠశాలను దత్తత తీసుకుని పునరుద్ధరించాలని కోరారు. 


ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

Posted 5 hours ago | Category : politics

ఎన్నికల్లో పవన్ రాణిస్తారు అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ..!

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

Posted 6 hours ago | Category : politics

కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీస్ కుమారుడు..దాడి,దౌర్జన్యం..!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Posted 12 hours ago | Category : politics

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted a day ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted a day ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 2 days ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 2 days ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 2 days ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 2 days ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 2 days ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 2 days ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!