ఆంధ్రప్రదేశ్‌ సచివాలయం ఖాళీ

Posted 10 months ago | Category : state politics

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో అప్రకటిత సెలవు వాతావరణం కనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన నేపథ్యంలో మంత్రి నారా లోకేష్‌ మినహా మిగిలినవారెవ్వరూ సచివాలయం వైపు కూడా తొంగిచూడలేదు. దీంతో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, వారి పరిధిలో ఉండే కార్యదర్శులు, కింది స్థాయి అధికారులు సచివాలయం వైపు రాలేదు. కార్యాలయాలు అత్యధిక శాతం ఖాళీగా బోసిపోయి కనిపించాయి. ముఖ్యమంత్రి లేకపోతే మంత్రులు, ఉన్నతాధికారులెవరూ సచివాలయానికి రాని పరిస్థితి నెలకొంది. సీఎం బుధవారం బయల్దేరి వెళ్లిన నేపథ్యంలో ఆరోజే కొంతమంది అధికారులు మధ్యాహ్నం నుంచే సచివాలయం నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. గురువారం అయితే మంత్రులు, అధికారులు లేక సచివాలయం కళ తప్పింది. కనీసం గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన మంత్రులు కూడా సచివాలయానికి రాలేదు. సచివాలయంలో ప్రతి శుక్రవారం ప్రజా విజ్ఞప్తుల రోజుగా నిర్వహిస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే అధికారులు, ఉద్యోగుల్లో చాలామంది సచివాలయాన్ని ఖాళీ చేస్తున్నారు. దీంతో సమస్యలను విన్నవించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న బాధితులు ఇబ్బందులు పడుతుండేవారు. దీంతో అధికారులకు వెసులుబాటు కల్పించేందుకు ప్రజా విజ్ఞప్తుల రోజును గురువారానికి ముఖ్యమంత్రి మార్చారు. కానీ గురువారం కూడా అధికారులు, మంత్రులు అందుబాటులో లేకుండాపోయారు. ఆరోగ్య సమస్యలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోరేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన బాధితులు వారికి సమాధానం చెప్పేవారు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.


చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

Posted 38 minutes ago | Category : state

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

కనండి.. కంటూనే ఉండండి..!

Posted an hour ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 2 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

Posted 6 hours ago | Category : state

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్....! Video

Posted 8 hours ago | Category : state

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి  వెడ్డింగ్ రిసెప్షన్....! Video

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

Posted 9 hours ago | Category : state

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 10 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 10 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

Posted 10 hours ago | Category : state

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

Posted 11 hours ago | Category : state

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!

Posted 11 hours ago | Category : state

 కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!