ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

కేంద్రమంత్రి అనిల్‌ దవే హఠాన్మరణం

Posted 7 months ago national politics

కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు  అనిల్ మాధ‌వ్ ద‌వే గురువారం ఉదయం ఆకస్మికంగా క‌న్నుమూశారు. 1956లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని బాద్ న‌గ‌ర్‌లో ద‌వే జ‌న్మించారు. ఆర్ యస్ యస్ ప్రచారక్ గా ఉంటూ మధ్య ప్రదేశ్ లో బిజెపి ని అధికారమలోకి తీసుకు రావడంలో కీలక పాత్ర వహించారు. 

గత జనవరి నుండి న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ మధ్యనే కోలుకొని విధులకు క్రియాశీలకంగా హాజరవుతున్నారు. అయితే గురువారం ఉదయం అనారోగ్యంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందారు. 

2009 నుండి రాజ్యసభ సభ్యునిగా ఉంటున్నారు.2016 జూలై 5 నుంచి ఆయ‌న కేంద్ర మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.  పర్యావరణ, అటవీ శాఖ స్వతంత్ర హోదాలో సహాయ మంత్రిగా నియమితులయ్యారు.తొలి నుండి పర్యావరణ సమస్యల పట్ల తీవ్ర ఆసక్తి గల అయన `నర్మదా సమగ్ర'  అనే సంస్థ ద్వారా నర్మదా పరిరక్షణ కోసం చాలాకాలంగా కృషి చేస్తున్నారు. 

పార్ల‌మెంట్‌లోని అనేక క‌మిటీల్లో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. గ్లోబ‌ల్ వార్మింగ్‌, క్లైమెట్ చేంజ్ పార్ల‌మెంట్ క‌మిటీలో దవే కీల‌క స‌భ్యుడిగా ఉన్నారు. ఆయన పలు గ్రంధాల రచయత కూడా.  సౌమ్యంగా, నిరాడంబరంగా ఉండే ఆయన అంతర్జాతీయ వేదికలపై కుండా పర్యావరణ అంశాలపై కృషి చేశారు.

కేంద్ర మంత్రి ద‌వే మృతి ప‌ట్ల ప్ర‌ధాని  నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ద‌వే మృతి త‌న‌ను షాక్‌కు గురిచేసిన‌ట్లు ప్ర‌ధాని ట్వీట్ చేశారు. ప్ర‌జాసేవ‌కుడిగా ద‌వేను స్మ‌రించుకుంటామ‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ద‌వే చాలా ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేసేవార‌న్నారు. బుధ‌వారం సాయంత్రం కూడా త‌న‌తో విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను చ‌ర్చించిన‌ట్లు మోదీ చెప్పారు. 

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ దవే ఆకస్మిక మృతిపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృధువుగా  మాట్లాడే ఆయన తన వినయపూర్వక వ్యక్తిత్వానికి ఎల్లప్పుడూ గుర్తుండి పోతారని ఆమె నివాళులు అర్పించారు. యం వెంకయ్యనాయుడు, నితిన్ గడ్కరీలతో సహా పలువురు కేంద్ర మంత్రులు కూడా ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. 

Related Articles

Most Read