//single page style gallary page

తెదేపాకి మరో షాక్ : మరో ఇద్దరు నాయకుల గుడ్ బై

Posted 6 months ago | Category : politics

తెలంగాణ తెలుగుదేశం దాదాపు ఖాళీ అయిపోయింది.

అయితే దానికి విరుద్దంగా తెలంగాణ‌లో తాము బ‌లంగా ఉన్నామ‌ని, రేవంత్ వంటి ఒక‌రిద్ద‌రు వెళ్లిపోయినంత మాత్రాన త‌మ‌కు వ‌చ్చిన న‌ష్టం లేద‌ని ప్ర‌క‌టించిన తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్‌. ర‌మ‌ణ వ్యాఖ్య‌లు నవ్వుల పాలు చేసేలా ఉన్నాయి.

ఇటీవ‌లి ప‌రిణామాల‌ను చూస్తే.. గంప గుత్త‌గా టీడీపీ తెలంగాణ‌లో ఖాళీ అయిపోబోతోందా అనిపిస్తోంది. ఇన్నాళ్ళు నిజామాబాద్ జిల్లాలో పార్టీని తమ భుజాల మీద నడిపించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, ఆర్మూర్ ఇంఛార్జ్ రాజారాం యాదవ్ కూడా రేవంత్ రెడ్డితో పాటే కాంగ్రెస్ గూటికి చేరటంతో ప్రస్తుతం జిల్లాలో టీడీపీ పరిస్థితి జెండా మోసే దిక్కులేకుండా పోయింది. ఇక జిల్లాలో మిగిలిన ఇద్దరు సీనియర్ నేతలు మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ.

కొంత కాలంగా ఈ ఇద్దరు సీనియర్ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీలోకి వెళితే బాగుంటుంది అనే లెక్క‌ల్లో బిజీగా ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో మండ‌వ పోటీ చేయ‌లేదు. అంతేకాదు ఆయ‌న కేసీఆర్‌కి మంచి మిత్రుడు. దీంతో టీఆర్ఎస్‌లోకి వెళితే ఎలా ఉంటుంది అని అనుచ‌రులతో ఆయ‌న మంత‌నాలు జ‌రుపుతున్నారు. అన్నపూర్ణమ్మ కొడుకు బాల్కొండ నియోజకవర్గంలో అనుచరులను కలుస్తున్నా… ఇది వ్యక్తిగతంగానే తీసుకుంటున్నారు తప్ప పార్టీ పరంగా వారు చెప్పుకోవట్లేదు. మండవ వెంకటేశ్వరరావు సైతం కొన్ని రోజుల్లో గులాబీ గూటికి చేరుతారన్న ప్రచారం సాగుతోంది. దీంతో వీరిద్ద‌రు కూడా త్వ‌ర‌లోనే పార్టీకి ఝ‌ల‌క్ ఇవ్వ‌డం ఖాయం అంటున్నారు విశ్లేష‌కులు. అయితే ఎమి జరగనుందో వేచి చూడాలి మరి


మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

Posted 19 hours ago | Category : sports politics

మోడీ కోహ్లి ఛాలెంజ్ పై పొలిటికల్ కామెంట్స్

టీడీపీలోకి కీల‌క నేత‌..!!

Posted 20 hours ago | Category : politics

 టీడీపీలోకి కీల‌క నేత‌..!!

రంగంలోకి కుమారస్వామి భార్య

Posted a day ago | Category : national politics

రంగంలోకి కుమారస్వామి భార్య

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

Posted a day ago | Category : politics

ఇలా అయితే.. ప్ర‌పంచ బ్యాంక్‌కు క‌న్నం వేయాల్సిందే..!!

ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

Posted a day ago | Category : politics

 ప‌వ‌న్ యాత్ర‌.. పూన‌కంతో నాలుగు సినిమా డైలాలుగు .. వెయిటింగ్ ఫ‌ర్ టీడీపీ రియాక్ష‌న్‌..?

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

Posted a day ago | Category : politics

చంద్ర‌బాబు ఎంట్రీ.. దేశ రాజ‌కీయాల్లో పెను సంచ‌ల‌నం..!!

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

Posted a day ago | Category : politics movies

ప‌వ‌న్‌పై శ్రీ‌రెడ్డి డైరెక్ట్ అటాక్‌..!!

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

Posted a day ago | Category : politics

ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!!

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

Posted 2 days ago | Category : politics

వైఎస్ జగన్ మైక్ రికార్డ్స్.. బ్రేక్ చేస్తున్న పవన్ క‌ళ్యాణ్..!

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

Posted 2 days ago | Category : politics national

కుమారస్వామిని భయపెడుతున్న ఇల్లు

జగన్ పార్టీకి షాక్

Posted 2 days ago | Category : state politics

జగన్ పార్టీకి షాక్