ఉగ్రవాదంపై మౌనంగా ఉండబోమని పాక్ కు ట్రంప్ హెచ్చరిక !

Posted 6 months ago | Category : world

మొదటిసారి ఉగ్రవాదం విషయంలో అమెరికా పాకిస్థాన్ ను నేరుగా హెచ్చరించింది. ఉగ్రవాదులకు నీడనిస్తున్న పాకిస్థాన్ ను ఇంకేమాత్రం సహింపబోమని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ద‌క్షిణ ఆసియాపై అనుస‌రించాల్సిన‌ ర‌క్ష‌ణ వ్యూహాన్ని తాజాగా ప్ర‌క‌టించిన ట్రంప్ ఆ సంద‌ర్భంగా ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

ఉగ్ర‌వాద సంస్థ‌లుకు పాకిస్థాన్ ఆరామంగా మారింద‌ని, దీని ప‌ట్ల తాము మౌనంగా ఉండ‌బోమ‌ని ట్రంప్ చెప్పారు. ఆఫ్ఘ‌నిస్తాన్ శాంతి కోసం తాము చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు పాకిస్థాన్ అండ‌గా నిలివాల‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. నేర‌గాళ్లు, ఉగ్ర‌వాదుల‌కు ఊతం ఇవ్వ‌డం వ‌ల్ల పాకిస్థాన్ న‌ష్ట‌పోతుంద‌ని హెచ్చరించారు. ఉగ్ర‌వాదాన్ని అణిచివేయ‌ని ప‌క్షంలో అణ్వాయుధ దేశ‌మైన పాకిస్థాన్‌కు ర‌క్ష‌ణ స‌హాయం నిలిపేస్తామ‌ని ట్రంప్ వెల్లడించారు. 

 ఉగ్ర‌వాదంపై పోరాటం కోసం పాకిస్థాన్‌కు బిలియ‌న్ల డాల‌ర్ల‌ను ఇస్తున్నామ‌ని, కానీ ఆ దేశం మాత్రం ఉగ్ర‌వాదుల‌కు నీడ‌నిస్తున్న‌ద‌ని ఆప్పించారు. ఇలాంటి ధోర‌ణి మారాల‌ని, అది త‌ప్ప‌కుండా మారుతుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. పాకిస్థాన్‌కు స‌రైన నాగ‌రిక‌త‌ను అల‌వాటు చేసుకునే సంద‌ర్భం వ‌చ్చింద‌ని, శాంతి స్థాప‌న‌కు ఆ దేశం స‌హ‌క‌రించాల‌ని స్పష్టం చేశారు. ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులకు రష్యా, చైనా లతో కలసి పాకిస్తాన్ సహకారం అందిస్తునందుకే ట్రంప్ ఆగ్రహం చెందుతున్నట్లు తెలుస్తున్నది. 

మ‌రో వైపు భార‌త్‌తో బ‌ల‌మైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్న‌ట్లు ట్రంప్ ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి అమెరికా ద‌ళాల‌ను వెన‌క్కి ర‌ప్పించాల్సిన అంశంపైన కూడా ట్రంప్‌ స్పందించారు. అమెరికా ద‌ళాల‌ను ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి ఉప‌సంహ‌రిస్తే, అక్క‌డ మ‌ళ్లీ ఉగ్ర‌వాదులు పేరుకుపోయే అవ‌కాశం ఉంద‌ని ట్రంప్ అన్నారు. ఇరాక్‌లో చేసిన త‌ప్పును ఇక్క‌డ చేయ‌లేమ‌ని స్పష్టం చేశారు. అభివృద్ధి సాధిస్తున్నంత వ‌ర‌కు ఆఫ్ఘ‌నిస్తాన్‌కు స‌హ‌కరిస్తూనే ఉంటామ‌ని తెలిపారు.


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!