ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

పిచ్చోడి చేతిలో రాయి

Posted 7 months ago world

ఆఫ్ఘానిస్తాన్ మీద అమెరికా అతి పెద్ద అణ్వస్త్రేతర బాంబు దాడి చేసింది. అంతకముందు సిరియాపై క్షిపణి దాడి చేసింది ఒక అమెరికా యుద్ధ నౌక. ఈ రెండు దాడులకు కారణం ఎవరికీ తెలియదు. అటు సిరియా, అఫ్గన్ ప్రభుత్వాలకు కాని, ఇటు అమెరికా ప్రజలకు గాని ట్రంప్ బాంబులు ఎందుకు వేశాడో అర్ధంకాలేదు. ట్రంప్ తన ఎలక్షన్ ప్రచారంలో డెమోక్రాట్లు అమెరికన్ సైన్యాన్ని విదేశాలకు పంపి తమవి కాని యుద్దాలు చేస్తూ అమెరికా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, తాను పదవిలోకి వస్తే ఇలాంటి యుద్ధాలకు స్వస్తి చెప్పి 'అమెరికన్స్ ఫస్ట్' అని, వీరి అభివృద్ధికి పాటు పడతానని డప్పుకొట్టాడు. అందరు రాజకీయవేత్తల్లాగానే పదవిలోకి రావటంతో ఆ విషయం మరిచిపోయాడు. సిరియాలోని మోసుల్ ప్రాంతంలో క్షిపణి దాడికి కారణం ట్రంప్ కూతురు సిరోయాలో జరిగిన గ్యాస్ ఎటాక్ పై కోపంతో తండ్రికి సలహా ఇస్తే ఆమెను సంతృప్తి పరచటానికి బాంబును వేశాడని ట్రంప్ సుపుత్రుడు తెలిపాడు. ఆఫ్ఘానిస్తాన్ పై దాడి ఐసీస్ ఉగ్రవాదుల స్థావరాలను మట్టుపెట్టడానికని ప్రచారం జరుగుతున్నా, లాభపడింది మాత్రం తాలిబన్లు. తాలిబన్ల నుంచి ఈ గుహలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు స్వాధీనపరుచుకోగా ఇప్పుడు ఆ గుహలను ఖాళీ చేయంచి ట్రంప్ తాలిబన్లకు అప్పగించినట్లయ్యింది.

ట్రంప్ దక్షిణ కొరియా సముద్ర ప్రాంతంలోకి తమ నేవీ దళం పంపి ఉత్తర కొరియాకు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చాడు. ఒక టెలివిజన్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ "అన్ని బాంబులకు అమ్మ" లాంటి బాంబును ప్రయోగించింది, ఉత్తర కొరియాకు ఒక సందేశం పంపడానికే అని తెలిపాడు. ఈ పరిస్థితి అమెరికన్లను నిస్సాహయస్థితిలో పడేసింది. హిందీలో బుడ్డా సఠియ గయా అంటారు. అంటే అరవై ఏళ్ళు దాటిన ముసలాడికి మతిస్థిమితం తప్పింది అని. పిచ్చోడి చేతిలో రాయిలా అమెరికా ప్రెసిడెంట్ తమ దేశానికి ఏ విధంగానూ శత్రువులు కానివారిపై అకారణంగా బాంబులు వేయటం చూస్తే అమెరికాలో ఆయనపై ఎవరికి కంట్రోల్ లేదనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజం కానుంది అమెరికన్స్ ఫస్ట్ అన్న ఆయన నినాదం అమెరికా ప్రజలను ప్రపంచవ్యాప్తంగా రిస్క్ లో పడేసింది. ముస్లింలు, ఉత్తర కొరియాకు చెందిన కొరియన్లు అమెరికా ప్రజలను, వారి కంపెనీలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తే దానికి బాద్యుడు ఒక్క ట్రంప్ మాత్రమే.

Most Read