ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

నవంబర్ లో హైదరాబాద్ కు ట్రంప్ కుమార్తె

Posted 3 months ago world

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన ప్రభుత్వ సలహాదారులైన ఇవాంక ట్రంప్ నవంబర్ చివరిలో హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ లో నవంబర్ 28న జరుగనున్న గ్లోబల్ ఎంట్రెప్రేనేర్షిప్ సదస్సులో పాల్గొనే అమెరికా ప్రతినిధి వర్గానికి ఆమె నాయకత్వం వహిస్తారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారు. గత జూన్ లో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆమెను ఆహ్వానించారు.

2010లో అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ప్రారంభించిన ఈ వార్షిక సదస్సు జరగడం ఇది ఎనిమిదవసారి. ఈ సదస్సు నిర్వహణకు వేదికలుగా ఢిల్లీ, ముంబై, బెంగుళూరు తదితర నగరాలను కూడా పరిశీలించిన తర్వాత చివరిగా హైదరాబాద్ ను ఎంపిక చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ, తెలంగాణ ప్రభుత్వాల సమన్వయంతో ఈ సదస్సు నిర్వహణ బాధ్యతని నీతి ఆయోగ్ కు కేంద్రం అప్పచెప్పింది.

భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న H1 -B వీసాల అంశం ఈ సదస్సులో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలోని సైపుణ్యం కలిగిన ప్రొఫెషనల్స్ సేవలను ట్రంప్ ప్రభుత్వం గుర్తించాలని అంటూ విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ రాజ్యసభలో ఈ మధ్య ఆశాభావం వ్యక్తం చేయడం గమనార్హం.

Most Read