ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

దీపావళి వేడుకల్లో పాల్గొన్న ట్రంప్

Posted a month ago world

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఓవల్ ఆఫీసులో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. భారతీయ సంతతకి చెందిన విజిటర్స్‌తో పాటు యూఎన్ అంబాసిడర్ నిక్కీ హేలీ, సీమా వర్మ, ఇతరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ట్రంప్ కూతురు ఇవాంకా కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. వైట్‌హౌజ్‌లో దీపావళి వేడుకలను జరుపుకునే సాంప్రదాయాన్ని మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రారంభించారు. వైట్‌హౌజ్ కాంప్లెక్స్‌కు ఆనుకుని ఉన్న ఇండియన్ ట్రీట్ రూమ్‌లో ఆ వేడుకలను నిర్వహించేవారు.

కానీ బుష్ ఎప్పుడూ నేరుగా వైట్‌హౌజ్‌లో దివాళీ సంబరాల్లో పాల్గొనలేదు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా వైట్‌హౌజ్‌లోని ఈస్ట్ రూక్ రూమ్‌లో దీపావళి వేడుకల్లో పాల్గోనేవారు. పీపుల్స్ హౌజ్‌లో దీపావళి వేడుకల్లో పాల్గోన్న డోనాల్డ్ ట్రంప్ తన ఫేజ్‌బుక్ పేజీలో ప్రత్యేకంగా ఓ పోస్ట్ చేశారు. భారతీయులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గోనడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

భారత్..ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మించిందన్నారు. ప్రధాని మోదీతో తనకు బలమైన బంధం ఉందని ట్రంప్ అన్నారు. అమెరికా ప్రగతికి.. ప్రపంచానికి..భారతసంతతి విశేష తోడ్పాటు అందించారన్నారు. ఆర్ట్, సైన్స్, మెడిసిన్, బిజినెస్, ఎడ్యుకేషన్ రంగాల్లో.. భారతీయులు అందించిన సేవలు.. అనితరసాధ్యమని ట్రంప్ అన్నారు.ఇండియన్ అమెరికన్ పౌరులకు అమెరికా చాలా రుణపడి ఉందని, వారందరికీ థ్యాంక్స్ అని ట్రంప్ తెలిపారు. దీవాళిని ప్రజలు తమ ఇండ్లల్లో సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ ఈ సారి ఆ వేడుకను పీపుల్స్ హౌజ్(వైట్‌హౌజ్)లో సెలబ్రేట్ చేసుకుంటున్నామని ట్రంప్ అన్నారు. అమెరికా కుటుంబంలో.. ఇండియన్ అమెరికన్లు..హిందూ అమెరికన్లు భాగస్వామ్యులే అని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా భారతప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ట్రంప్.

Most Read