ట్రంప్‌ రూల్స్ మర్చిపోయారు..

Posted 10 months ago | Category : national politics

డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇతనొక సంచలనం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలుకొని, ఇప్పటివరకు తన అనుచిత వ్యాఖ్యలతో, విచిత్ర హావభావాలతో, సంచలన నిర్ణయాలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే ట్రంప్ ఇప్పుడు తాజాగా మరొక వివాదంలో చిక్కుకున్నాడు. అధ్యక్ష హోదాలో ఉన్న ట్రంప్ అమెరికా జాతీయగీతాన్ని గౌరవించాలన్న కనీస నియమాన్ని మర్చిపోయాడు.

సోమవారం నాడు అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఈస్టర్ ఎగ్ రోల్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా భార్య, కుమారుడితో కలిసి ట్రంప్ అతిధులను స్వాగతించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జాతీయగీతాన్ని ఆలపించారు. అమెరికన్లు జాతీయగీతాన్ని ఆలపించేటప్పుడు తమ కుడిచేతిని హృదయంపై ఉంచి గీతాన్ని గౌరవిస్తారు. కానీ ట్రంప్ ఈ విషయాన్నీ మర్చిపోవటంతో భార్య మెలానియా చేతితో తట్టి గుర్తుచేసింది. దీనితో ట్రంప్ తన చేతిని హృదయంపై ఉంచి గీతాన్ని గౌరవించారు. ఇదిలా ఉంటే ఇపుడు దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

దేశ అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తికి కూడా కనీస నియమాలు నేర్పాల్సి వస్తోందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అమెరికాలో పుట్టిన ట్రంప్ కు వలసదారులు గుర్తుచేయాల్సి వచ్చిందని విమర్శిస్తున్నారు. ట్రంప్ న్యూయార్క్ లో పుట్టాడు.అతని భార్య అయిన మెలానియా కుటుంబం స్లోవేనియా నుంచి అమెరికాకు వలస వచ్చారు.


జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

Posted an hour ago | Category : national

జియో ఫోన్ ఇప్పుడు మరింత అందుబాటులో......!

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

Posted 4 hours ago | Category : national

పెళ్లి కట్నంతో ఆశ్చర్యం..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 10 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

Posted 10 hours ago | Category : politics

సీఎం కేసీఆర్ కు వచ్చే కానుకల్లో ఇది ప్రత్యేకం..!

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

Posted 11 hours ago | Category : politics

నేటి జేఎఫ్‌సీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం..!

మంత్రికి తప్పిన ముప్పు..!

Posted 12 hours ago | Category : politics

మంత్రికి తప్పిన ముప్పు..!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Posted 14 hours ago | Category : politics

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

Posted 14 hours ago | Category : politics

90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

Posted 15 hours ago | Category : politics

కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ గాంధీ..!

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

Posted 17 hours ago | Category : politics

(బీజేపీ,టీడీపీ)ఒకరి పై ఒకరు బురద జల్లుకోవద్దు..!

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!

Posted 17 hours ago | Category : politics

బీజేపీ టీడీపీ విడిపోండి..అదే నా కోరిక..!