వాతావరణ మార్పుపై ట్రంప్ దాడి.... అంతర్జాతీయ కృషికి సవాల్

Posted 9 months ago | Category : world

వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించిన 195 దేశాల మ‌ధ్య కుదిరిన పారిస్ ఒప్పందం నుండి నిష్క్రమిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం పర్యావరణ పరిరక్షణ కోసం జరుపుతున్న అంతర్జాతీయ కృషినే సవాల్ చేసిన్నట్లు అవుతుంది. చరిత్ర పరంగా అత్యధిక హరిత కలుషిత వాయువులను వదిలే దేశం మాత్రమే కాకుండా ప్రస్తుతం కూడా అత్యధికంగా ఉద్గారాలను వదులుతున్న దేశం అమెరికా. 

ప్రపంచ సగటు వాతావరణ ఉష్ణోగ్రత  పెరుగుదలను 2 సి కన్నా ఎక్కువగా పెరగకుండా నివారించాలనే  లక్ష్యంతో 2015 డిసెంబర్ 12 న ప్యారిస్ లో 195 దేశాలు ఈ ఒప్పందం చేసుకున్నాయి.  వాతావరణ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం 2025 నాటికి 2005 నాటి స్థాయి కన్నా కేవలం 26 నుండి 28 శాతం ఉద్గారాలను మాత్రమే తగ్గిస్తామని అమెరికా ప్రతినబూనినది. 1990 నాటి ప్రమాణంతో పోల్చుకుంటే ఇది కేవలం 13 నుండి 15 శాతమే అవుతుంది. అదే ఐరోపా యూనియన్ 2030 నాటికి 1990 నాటితో పోల్చుకొంటే 40 శాతం తగ్గించాలని ప్రతినబూనాయి. 

ఇప్పటికే బలహీనంగా ఉన్న తమ లక్ష్యాలను కూడా చేరుకోబోమని ఈ ఒప్పందం నుండి నిష్క్రమించడం ద్వారా అమెరికా వెల్లడించినట్టు అయింది. మరో వంక వాతావరణ మార్పు కార్యక్రమాలకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేయడం కోసం ఉద్దేశించిన హరిత వాతావరణ నిధికి హామీ ఇచ్చిన 2 బిలియన్ డాలర్లను కూడా ఇవ్వబోమని అమెరికా  తెలిపింది. 

ఇక, స్వదేశంలో దేశీయ శిలాజ ఇంధన ఉత్పత్తిని ఎటువంటి అడ్డంకులు లేకుండా వ్యాప్తి చేస్తామని, స్వచ్ఛమైన ఇంధన ప్రణాలికకు తిలోదికాలు ఇచ్చిన్నట్లే అని ట్రంప్ తన చర్య ద్వారా స్పష్టం చేసిన్నట్లు అయింది.  అంతర్జాతీయ ఒప్పందాల నుండి అర్ధాంతరంగా నిష్క్రమించడం అమెరికాకు ఇదే మొదటి సారి కాదు. ఇంతకు ముందు క్యోటో ప్రోటోకాల్ నుండి కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సరైన లక్ష్యాలను లేవనే సాకుతో నిష్క్రమించింది. ఇప్పుడు ప్యారిస్ ఒప్పందం అసమంజసంగా ఉన్నదంటూ నిష్క్రమిస్తున్నది.  

వాతావరణ మార్పు అన్నది అంతర్జాతీయ సవాల్ కావడంతో అమెరికా తాకట్టు పెట్టె విధంగా వ్యవహరింప లేదని సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కేంద్రం డైరెక్టర్ జనరల్ సునీతా నారాయణ్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం నుండి నిష్క్రమించడం ద్వారా 5 శాతం ప్రపంచ జనాభాతో మిగిలిన 95 శాతం ప్రజలను ప్రమాదకరంలోకి నెట్టి వేయడాన్ని సహించలేమని ఆమె చెప్పారు. ప్రపంచంపై ప్రభావం చూపే నిర్ణయాలకు అమెరికాను జవాబుదారీతనం వహించే విధంగా చేయాలని ఆమె పిలుపిచ్చారు. 


బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

Posted 15 hours ago | Category : world

బుడ్డోడు గుడ్డు పెట్టాడు..!

తాజ్ శివాలయం కాదు సమాధి..!

Posted 18 hours ago | Category : world

తాజ్ శివాలయం కాదు సమాధి..!

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

Posted 5 days ago | Category : world

టేకాఫ్ అయిన ప్లేన్.. 71 మంది మృతి..!

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

Posted 6 days ago | Category : world

6 ఏళ్ళ జైనబ్ అన్సారీ..నిందితుడు అలీకి 4 మరణ శిక్షలు..!

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

Posted 6 days ago | Category : world

కన్యత్వంతో ప్లాట్స్ కొంటాం..!

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

Posted 6 days ago | Category : world

గూగుల్ లో ఉన్నది తీసేసారు..!

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

Posted 6 days ago | Category : world

దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం..!

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

Posted 7 days ago | Category : world

వాలెంటైన్స్ డే స్పెషల్ గా..బాయ్ ఫ్రెండ్ ని చంపిన గర్ల్ ఫ్రెండ్..!

బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

Posted 8 days ago | Category : world

 బిల్లియన్ డాలర్ల మార్కెట్,టాప్ 3 లో అమెజాన్..!

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

Posted 12 days ago | Category : world

బిడ్డకు జన్మనిచ్చిన 'అబ్బాయి గారు'

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19 మంది మృతి..!

Posted 12 days ago | Category : world

హాంగ్ కాంగ్ లో రేసుకు వెళ్తున్న డబల్ డెక్కర్..19  మంది మృతి..!