ప్రపంచం జాతీయ ప్రాంతీయ రాజకీయాలు క్రీడలు వాణిజ్యం సినిమా సంపాదకీయం టెక్నాలజీ GST

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

CONTACT US

#203 Srinivasa Colony West
Ameerpet, Hyderabad-500038

Phone:040-23745777

E-Mail: info@ins.media

H1B వీసాదారుల కోసం అమెరికన్లను నిర్లక్ష్యం చేసే కంపెనీలపై చర్యలు తీసుకోనున్న ట్రంప్ ప్రభుత్వం

Posted 8 months ago national world

జస్టిస్ డిపార్టుమెంట్ కు చెందిన యార్డింగ్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ టామ్ వ్విలార్ సివిల్ రైట్ డివిజన్ తరపున మాట్లాడుతూ తమ డిపార్ట్మెంట్ అమెరికన్ వర్కర్లను నిర్లక్ష్యం చేసే కంపెనీలను క్షమించమని తెలిపారు. H1B దరఖాస్తులను స్వీకరిస్తున్న ఈ సమయం లో ఈ వార్నింగ్ రావడం ప్రాముఖ్యం సంతరించుకుంది. 'యూ ఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ' ఎన్నో కొత్త విధానాల ద్వారా H1B వీసాల దురుపయోగం జరగకుండా నిషేధించడానికి ప్రయత్నిస్తోంది. ఒక వేళ అలా జరిగితే దానిని ఆపటానికి ఆ కంపెనీల ఫై చర్యలు తీసుకోవటమే కాకా వాటిని బ్లాక్ లిస్టులో పెట్టే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 3న USCIS చేసిన ప్రకటనలో H1B వీసాల దరఖాస్తులను శీల్య పరీక్షలకు గురి చేసి అన్ని అర్హతలు ఉన్న వారికి మాత్రమే అమెరికాలోకి ప్రవేశం దక్కేలా చూస్తామని వెల్లడించింది. తమ ముఖ్య ఉద్దేశం.. H1B వీసాల ఫ్రాడ్ ను నిరోధించటమేనని USCIS అధికారులు తెలిపారు. ఎంతోమంది అమెరికన్లు ఈ రంగాల్లో ఉద్యోగ్గాలకు అర్హులైన వారిని కాదని విదేశీయులను ఉద్యోగాలలో నియమించుకోవటాన్ని అన్ని విధాలుగా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం ఎవరినైనా ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేయటం నేరమని అలాంటి వారిని చట్ట ప్రకారం శిక్షార్హులని జస్టిస్ డిపార్ట్మెంట్ తెలిపింది. అలా నిర్లక్ష్యానికి గురైన అమెరికన్లు జస్టిస్ డిపార్ట్మెంట్ కు సివిల్ రైడ్స్ డివిజన్ లో ఇమ్మిగ్రేట్ ఎంప్లాయ్ రైట్స్ సెక్షన్ లో రిపోర్ట్ చేయవచ్చునని వారు తెలిపారు. అలాంటి కేసులను త్వరగా పరిష్కరిస్తామన్నారు. USCIS కూడా కంపెనీలను టార్గెట్ చేసి ఏప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తామని తెలిపింది. అంతేకాక ఎవరికైనా తమకు H1B వీసాదారులు నియామకం మూలంగా అన్యాయం జరిగిందిందనిపిస్తే అలాంటి అమెరికన్ పౌరుల కంప్లయింట్ లను స్వీకరించటానికి USCIS ఒక ఇమెయిల్ ను ప్రత్యేకంగా సృష్టించింది. మన కంపెనీ లు ఇకఫై ఎంతో జాగరుకతతో వ్యవహరించవలసివుంటుంది .

Most Read