//single page style gallary page

బీజేపీ నేతలను అడ్డుకుంటే బదిలీ తప్పదు !

Posted a year ago | Category : politics

పోలీస్అధికారులైనా, మరెవ్వరైనా సరే ...బిజెపి నేతలను అడ్డుకుంటే, వారి ముందు  చట్టం ప్రస్తావన తెస్తే బదిలీ కాక తప్పదు. ఒక మహిళా పోలీస్ అధికారిని అర్ధాంతరంగా బదిలీ చేయడం ద్వారా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఇచ్చిన సందేశం ఇదే.   

శాంతి భద్రతలను కాపాడటమే తన ప్రధాన కర్తవ్యం అని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన యోగి  ఇప్పుడు "బిజెపి కార్యకర్తల గర్వం కాపాడటమే కర్తవ్యం" అన్న రీతిలో విధి నిర్వహణలో బిజెపి నేతలను ఖాతరు చేయకుండా శభాష్ అనిపించుకున్న ఒక మహిళా పోలీస్ అధికారిపై బదిలీ వేటు వేశారు. 

ఇటీవల స్థానిక భాజపా నేతల తీరుకి దీటుగా సమాధానం చెప్పి వారిని జైలుకు పంపి అందరి దృష్టిని ఆకర్షించిన ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసు అధికారిణి శ్రేష్ఠా ఠాకూర్‌ బదిలీ అయ్యారు. బులంద్‌షెహర్‌లోని స్యానా సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న ఆమెని బహ్రైచ్‌కి బదిలీ చేశారు.స్థానిక బీజేపీ కార్యకర్తల నుంచి ఒత్తిడే ఆమె బదీలీకి కారణమని ప్రచారం జరుగుతోంది.

గత నెల 25న జిల్లా స్ధాయి బీజేపీ కార్యకర్తలతో  సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా వారికి జరిమాన విధించి జైలుకు పంపించింది. పదుల సంఖ్యలో వారంతా గుమిగూడి ఆమెను బెదిరించే ప్రయత్నం చేసినా ఏ మాత్రం భయపడకుండా మీ వాహనాలు తనిఖీ చేయకూడదని వెళ్లి ముఖ్యమంత్రితో లిఖిత పూర్వక అనుమతి లేఖను తీసుకొనిరండి అని దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది. 

ఇది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆమె సాహసానికి ప్రశంసల జల్లు కురిసింది. కానీ ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆమె బదిలీ అవడం గమనార్హం. 11 మంది బిజెపి ఎమ్మెల్యేలు, యంపీలు ముఖ్యమంత్రిని కలసి వత్తిడి తేవడంతో బదిలీ జరిగిన్నట్లు తెలుస్తున్నది. 

షాకింగ్ ...చంద్రబాబు లగడపాటి కోసమే ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారా

Posted 31 minutes ago | Category : politics state

షాకింగ్ ...చంద్రబాబు లగడపాటి కోసమే ఆ సంచలన నిర్ణయం తీసుకున్నారా

గూగుల్ లో సంచలనం గా మారిన సెర్చ్ సెన్సేషన్ గా ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని

Posted an hour ago | Category : politics

గూగుల్ లో సంచలనం గా మారిన సెర్చ్ సెన్సేషన్ గా ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని

కాంగ్రెస్ పార్టీ ఫ్రెండ్లీ పోటీ షాక్ .. అయోమయంలో మిత్రపక్ష పార్టీలు

Posted 2 hours ago | Category : politics state

కాంగ్రెస్ పార్టీ  ఫ్రెండ్లీ పోటీ షాక్ ..  అయోమయంలో మిత్రపక్ష పార్టీలు

నేను టీడీపీలో చేరకపోవడానికి అసలు కారణం ఇదే ....!

Posted 2 hours ago | Category : politics

 నేను టీడీపీలో చేరకపోవడానికి అసలు  కారణం ఇదే ....!

మహాకూటమి లో ఆ నేత కు షాక్... తిరుగుబాటు ఫలితమేనా

Posted 5 hours ago | Category : politics

మహాకూటమి లో ఆ నేత కు షాక్... తిరుగుబాటు ఫలితమేనా

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బరిలోకి దిగనున్న అన‌సూయ‌..!

Posted 5 hours ago | Category : politics

వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా బరిలోకి దిగనున్న  అన‌సూయ‌..!

నాయినిని గట్టి దెబ్బ కొట్టిన కేసీఆర్ .. ముషీరాబాద్, కోదాడ టికెట్లు ఫైనల్

Posted 5 hours ago | Category : state politics

నాయినిని గట్టి దెబ్బ కొట్టిన కేసీఆర్  .. ముషీరాబాద్, కోదాడ టికెట్లు ఫైనల్

వైసీపీలో టెన్షన్ .... ఆ సీనియర్ కు చెక్ పెట్టిన జగన్

Posted 5 hours ago | Category : politics

వైసీపీలో టెన్షన్ .... ఆ సీనియర్ కు చెక్ పెట్టిన జగన్

టీడీపీకి సనత్ నగర్ సీటు అందుకేనా .. తలసానిపై రివెంజ్ తీర్చుకుంటారా

Posted 6 hours ago | Category : politics

టీడీపీకి సనత్ నగర్ సీటు అందుకేనా .. తలసానిపై రివెంజ్ తీర్చుకుంటారా

అలరించిన అమరావతి జలసంబరం ఎఫ్1హెచ్2ఓ రేస్ బాబును ప్రశంసించిన విపక్షాలు ప్రజలు

Posted 6 hours ago | Category : politics

అలరించిన అమరావతి జలసంబరం ఎఫ్1హెచ్2ఓ రేస్  బాబును ప్రశంసించిన విపక్షాలు ప్రజలు

సుహాసిని కలిసిరానున్న సినీ గ్లామర్ .....

Posted 7 hours ago | Category : politics state

సుహాసిని కలిసిరానున్న సినీ గ్లామర్ .....